- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కేసీఆర్ పాలనలో దళితులకు న్యాయం జరగదు : ఉత్తమ్
దిశ, వెబ్‌డెస్క్: ముఖ్యమంత్రి కేసీఆర్‌పై తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షులు, నల్లగొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. కేసీఆర్ నియోజకవర్గంలోని వర్గల్ మండలం వేలూరు గ్రామానికి చెందిన దళితుడు బ్లాగరి నర్సింహులు ఆత్మహత్య చేసుకుని మరణించడంపై ఉత్తమ్ స్పందించాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… నర్సింలు మరణానికి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకోవాలని డిమాండ్ చేశారు. దళితులకు మూడెకరాల భూమి ఇస్తామని మోసం చేసి, ఇప్పుడు ఉన్న భూమిని దౌర్జన్యంగా గుంజుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ నియోజకవర్గంలోనే ఇంత దారుణమా అని ఉత్తమ్ ప్రశ్నించారు. దళితులపై రోజురోజుకు దాడులు పెరుగుతున్నాయన్నారు. టీఆర్ఎస్ పాలన అంతం అయ్యే వరకు దళితులకు న్యాయం జరగదని, నర్సింలు మరణానికి కారణమైన అందరిపైన హత్య కేసు, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేయాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు.