- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
FB గ్రాంట్స్ సాధించిన ‘ఈట్ కొచ్చి ఈట్’
దిశ, ఫీచర్స్ : వివిధ దేశాలకు చెందిన కమ్యూనిటీలు సమాజంలో ప్రభావాన్ని సృష్టించేందుకు, తమ శక్తిని ఉపయోగించుకోవడంలో సహాయపడేందుకు ప్రముఖ టెక్ దిగ్గజం ఫేస్‌బుక్ ‘కమ్యూనిటీ యాక్సిలరేటర్ ప్రోగ్రామ్’ నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా తమ పనితీరుతో విజేతగా నిలిచిన కమ్యూనిటీకి $50,000 వరకు నిధులను అందిస్తోంది. ఈ ప్రోగ్రామ్ కోసం ప్రపంచవ్యాప్తంగా 13,000 కమ్యూనిటీలు దరఖాస్తు చేసుకోగా, ఇండియా నుంచి 13 కమ్యూనిటీలు ఎంపికయ్యాయి. వాటిలో ఈట్ కొచ్చి ఈట్(ఈకేఈ) ఇండియా నుంచి ‘కమ్యూనిటీ యాక్సిలరేటర్ ప్రోగ్రామ్’లోకి ప్రవేశించిన ఏకైక ఆహార ప్రియుల సంఘంగా గుర్తింపు పొందడం విశేషం.
2015లో ప్రారంభమై, డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో 5 లక్షలకు పైగా ఫాలోవర్స్ ఉన్న కేరళకు చెందిన ప్రముఖ ఫుడ్డీ కమ్యూనిటీ ‘ఈట్ కొచ్చి ఈట్’. ఈ కమ్యూనిటీ ఫేస్‌బుక్ నుంచి నిధులు పొందిన ఫస్ట్ ‘ఇండియన్ ఫుడ్ కమ్యూనిటీ(EKE)’గా అవతరించింది. తమ కమ్యూనిటీ భవిష్యత్ కార్యకలాపాల కోసం ఈ ఫండ్స్ అందుకుంటుండగా.. ఫేస్‌బుక్ ఉత్పత్తులు, మెంటర్‌షిప్ సెషన్స్ సిరీస్‌కు ముందస్తు యాక్సెస్‌ను కూడా పొందుతోంది. పరిశ్రమ నాయకులతో ఇంటరాక్టివ్ సెషన్‌లు నిర్వహించడం ద్వారా రెస్టారెంట్ వ్యాపారంలో వేరియస్ ట్రెండ్స్ గుర్తించడానికి, నైపుణ్యం సాధించడానికి EKE వేదికగా మారింది. లాక్‌డౌన్ సమయంలో కూడా ‘బ్యాచిలర్స్ కిచెన్’ వంటి వీడియో కంటెంట్‌తో నెటిజన్లను ఆకట్టుకుంది. ఇప్పటివరకు వివిధ సిరీస్‌లతో దాదాపు 200కి పైగా వీడియోలను ప్రొడ్యూస్ చేసింది.
‘కొచ్చిలోని అనేక ఫుడ్ జాయింట్‌లను లైమ్‌లైట్‌గా మార్చడంలో EKE సహాయపడింది. ఆహారాన్ని ఆస్వాదించేందుకు ఉత్తమమైన వేదికను సృష్టించడం ద్వారా ప్రజలను ఏకం చేయాలనే లక్ష్యంతో EKE ప్రారంభించాం. ఫేస్‌బుక్ ప్రశంసలు అందుకోవడం సంతోషంగా ఉంది. మేం చేస్తున్న ప్రయత్నానికి ఫలితం దక్కింది. మరెంతో మంది ప్రజలను మా ఫుడ్ కమ్యూనిటీలో భాగం చేయడంలో FB తోడ్పడుతుందని ఆశిస్తున్నాం. కమ్యూనిటీ ఎంగేజ్‌మెంట్, బ్రాండ్ అసోసియేషన్ల విషయానికి వస్తే.. అందరి సహాయంతో మల్టిపుల్ ఆపరేషనల్ మోడల్స్‌ను విజయవంతంగా అమలు చేస్తున్నాం’ అని EKE వ్యవస్థాపకుడు, క్రియేటివ్ హెడ్ కార్తీక్ మురళి అన్నారు.
‘కేరళీయులకు మంచి ఆహార సంస్కృతిని పరిచయం చేయడంపై దృష్టి సారించిన మొదటి డిజిటల్ కమ్యూనిటీలలో ‘ఈట్ కొచ్చి ఈట్’ ఒకటి. సంవత్సరాలుగా, వారు తమను తాము మల్టిపుల్ ఈవెంట్స్, సెమినార్‌లు నిర్వహించే సమూహంగా అభివృద్ధి చేసుకున్నారు. EKE ఈవెంట్స్‌కు హాజరవడం ద్వారా ఫుడ్ అండ్ రెస్టారెంట్ ఇండస్ట్రీకి చెందిన అనేక మంది నాయకులతో నెట్‌వర్క్ ఏర్పాటు చేసుకునే అవకాశం లభించింది’ అని మాస్టర్ చెఫ్, చెఫ్ సెలబ్రిటీ పిళ్లై అన్నారు.
‘క్యాటరింగ్ సర్వీస్‌ని ప్రారంభించి 14 సంవత్సరాలైంది. ఇంతకు ముందు నేను ఇన్ఫోపార్క్ ఉద్యోగులకు మాత్రమే సేవ చేసేవాడిని. EKE నా రెస్టారెంట్‌ని సందర్శించిన తర్వాత, కేరళ అంతటా ప్రజలు నా ఆహారాన్ని రుచి చూడటానికి క్యూలో నిలుచుంటున్నారు. రాష్ట్రంలోని వివిధ మూలల ప్రజలకు సేవ చేసే అవకాశం లభించినందుకు సంతోషంగా ఉంది’ అని నాదన్ ఫుడ్ ప్లేస్ కుంచిమోల్ తెలిపారు.