తాలిబన్‌తో ఆశాజనక సంభాషణ జరిగింది

by vinod kumar |
తాలిబన్‌తో ఆశాజనక సంభాషణ జరిగింది
X

న్యూఢిల్లీ : తాలిబన్‌లతో ఆశాజనక సంభాషణ జరిగినట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. ఒక అమెరికా అధ్యక్షుడు.. తాలిబన్‌ నేతతో నేరుగా మాట్లాడటం బహుశా ఇదే మొదటిసారి. తాలిబన్ నేత ముల్లా బరదర్‌తో ట్రంప్ మంగళవారం దాదాపు 35 నిమిషాలపాటు ఫోన్‌లో సంభాషించారు. ‘ఈ రోజు నేను తాలిబన్ లీడర్‌తో మాట్లాడాను. మా మధ్య మంచి సంభాషణ జరిగింది. హింస లేకుండా చూసుకోవడానికి ఇరువురం అంగీకరించాం. హింసాపాతాన్ని ఇరువురమూ కోరుకోవడం లేదు. భవిష్యత్‌లో ఏం జరుగుతుందో చూడాలి మరి. కానీ, మా ఇద్దరి మధ్య ఆశాజనకమైన సంభాషణ జరిగింది’ అని డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. ఫోన్ సంభాషణ జరిగినట్టు తాలిబన్ ప్రతినిధి కూడా ధృవీకరించారు. అఫ్ఘనిస్తాన్ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీతో యూఎస్ సెక్రెటరీ మైక్ పొంపెయ్ మాట్లాడుతారని ట్రంప్ తమకు హామీ ఇచ్చినట్టు తెలిపారు. దీంతో అఫ్ఘాన్ సర్కారుకు, తాలిబన్‌లకు మధ్య చర్చలకు మార్గం సుగమమవుతుందని భావిస్తున్నట్టు వివరించారు.

Tags: US president, donald trump, taliban, conversation, afghanistan, peace accord

Advertisement

Next Story

Most Viewed