- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
లక్షలాది మరణాలకు చైనాయే కారణం : ట్రంప్
దిశ, వెబ్ డెస్క్: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి చైనాపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే ఇరుదేశాల మధ్య వాణిజ్య యుద్ధం తారా స్థాయికి చేరింది. దీనికి తోడు కరోనా తోడవ్వడంతో చైనా పై అమెరికా తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతోంది.
డ్రాగన్ కంట్రీ తలచుకుంటే కరోనా వైరస్‌ను వుహాన్ నగరం దాటి బయటకు రాకుండా కట్టడి చేసేదని.. కానీ, చైనా అలా చేయకుండా కరోనాను ప్రపంచం పైకి వదిలిందని మరోసారి ట్రంప్ ఆరోపించారు. ఫలితంగా ఇన్ని దేశాలు కరోనా విలయానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయని అధ్యక్షుడు ట్రంప్ పేర్కొన్నారు.
ప్రపంచంలో చోటుచేసుకుంటున్న లక్షలాది మరణాలకు కారణం చైనా యే అని, ఆ దేశం నయవంచన కారణంగానే మరణాలు అధికంగా సంభవించాయని మండిపడ్డారు. కరోనా నుంచి అమెరికా ఇప్పుడిప్పుడే కోలుకుంటోందని, కొన్ని రాష్ట్రాల్లో తీవ్రత ఎక్కువగా ఉందన్నారు. తీవ్రత ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో కఠిన నిబంధనలు అమలు చేయాల్సి ఉందని వివరించారు. ఏప్రిల్ నెలతో పోలిస్తే ప్రస్తుతం మరణాలు తగ్గుముఖం పట్టాయని ట్రంప్ వెల్లడించారు.