డొనాల్డ్ ట్రంప్, మెలానియాలకు కరోనా పాజిటివ్

by vinod kumar |
డొనాల్డ్ ట్రంప్, మెలానియాలకు కరోనా పాజిటివ్
X

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఆయన సతీమణి మెలానియా ట్రంప్‌లకు కరోనా పాజిటివ్‌గా తేలింది. క్వారంటైన్, చికిత్స ప్రక్రియను మొదలుపెడుతున్నట్టు డొనాల్డ్ ట్రంప్ స్వయంగా ట్విట్టర్‌లో వెల్లడించారు. డొనాల్డ్ ట్రంప్‌కు అనుచరుడు హోప్ హిక్స్‌కు ఇటీవలే కరోనా వైరస్ సోకడం గమనార్హం. క్లీవ్‌లాండ్‌లో జరిగిన డిబేట్‌ కోసం ట్రంప్‌తోపాటు హిక్స్ వెళ్లిన సంగతి తెలిసిందే. గురువారం సాయంత్రం డొనాల్డ్ ట్రంప్ వైట్‌హౌజ్‌కు వెళ్తుండగా ఆరోగ్యంగానే కనిపించారు. 74 ఏళ్ల ట్రంప్ వయసు రీత్యా కరోనా రిస్కు గ్రూపులోనే ఉన్నారు. వైట్‌హౌజ్‌లోనే ట్రంప్ దంపతులు చికిత్స పొందనున్నట్టు వైట్‌హౌజ్ ఫిజిషియన్ ఓ మెమోలో వెల్లడించారు. ట్రంప్ దంపతుల ఆరోగ్య పరిస్థితులను నిషితంగా పరిశీలిస్తామని, రికవరీ సమయంలోనూ అధ్యక్షుడు తన కార్యకలాపాలు సాగించేలా చికిత్సనందిస్తామని ఫిజిషియన్ స్కాట్ కోన్లీ వివరించారు. సరిగ్గా ఎన్నికల మరో నెల రోజుల్లో ఉండగా మళ్లీ అధ్యక్ష బాధ్యతల కోసం తహతహలాడుతున్న ట్రంప్‌కు వైరస్ పాజిటివ్‌గా తేలడం నష్టమేనని తెలుస్తున్నది. ఆది నుంచీ ఆయన కరోనాను అందరు భావిస్తున్నంత ప్రమాదకారిగా గుర్తించలేదు. మాస్కు ధరించడానికీ అయిష్టంగానే ఉన్నారు. కరోనా పీక్‌ను దాటేశామని ఇటీవలే ప్రకటించిన ట్రంప్‌కు పాజిటివ్ రావడం ఎన్నికల క్యాంపెయిన్‌‌పై ప్రభావం వేయనున్నట్టు తెలుస్తున్నది.

Advertisement

Next Story

Most Viewed