- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
'షేప్ షిఫ్టింగ్ డ్రోన్స్' సాధ్యమే : యూఎస్ ఆర్మీ
దిశ, వెబ్ డెస్క్ : విపరీతమైన వేగంతో దూసుకొచ్చే కార్లు… అంతలోనే అదే వేగంతో గెయింట్ రోబోలా మారే ఫీట్లు.. సీటులో కూర్చున్న ప్రేక్షకుడు ఒక్కసారిగా ఆశ్చర్యపోతాడు. ఇదంతా హాలీవుడ్ సినిమా ‘ట్రాన్స్‌ఫార్మర్’లోనే కనిపిస్తాయి. అక్కడున్న పరిస్థితులకు అనుగుణంగా ఆ వార్ రోబోట్స్ ‘షేప్ షిఫ్టింగ్’ చేస్తుంటాయి. వాటికవే ఫోల్డ్ అయిపోయి మళ్లీ.. వెహికల్‌లా మారుతుంటాయి. మరి రియల్ లైఫ్‌లో అది సాధ్యమా? అంటే.. భవిష్యత్తులో సాధ్యం కావచ్చనే అంటున్నారు అమెరికా శాస్త్రవేత్తలు.
మిషన్ రిక్వైర్‌మెంట్ అనుసరించి.. గాల్లోనే వాటి షేప్‌ను మార్చుకునే డ్రోన్స్ లాంటి వెహికల్‌ను తయారుచేయడానికి కావాల్సిన టెక్నాలజీని యూఎస్ మిలటరీ డెవలప్ చేసింది. రెండు సంవత్సరాల పరిశోధనల తర్వాత ‘ఫ్లూయిడ్ స్ట్రక్చర్స్’కు సంబంధించిన టెక్నాలజీలో కొంత పురోగతి సాధించినట్లు, యూఎస్ ఆర్మీ రీసెర్చ్ లేబోరేటరీ, టెక్సాస్ ఏఅండ్ఎమ్ యూనివర్సిటీ పేర్కొన్నాయి. వాళ్ల పరిశోధనలతో ఓ కొత్త టూల్‌ను డెవలప్ చేశారు. దాంతో వెహికల్స్ వర్టికల్ టేక్ ఆఫ్ తీసుకుంటాయని వెల్లడించింది. ఇలాంటి వాటిని అనలైజ్ చేయడానికి కంప్యూటేషనల్ కాస్ట్ కనీసం పది వేల పనిగంటలు అవసరమయ్యేవని, కానీ తాము కనిపెట్టిన టూల్ వల్ల కంప్యూటేషనల్ కాస్ట్ 80 శాతం తగ్గిందని ఏరో స్పేస్ ఇంజనీర్ ఫ్రాన్సిస్ ఫిలిప్స్ తెలిపారు.