- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
చైనాకు సాయం చేస్తామంటూనే.. ప్రతీకార చర్యలకు అమెరికా!
కరోనా వైరస్‌పై చైనా సరైన సమాచారం ఇవ్వలేదని, ఇప్పటికీ పూర్తి స్థాయిలో సహకరించడం లేదని అమెరికా ఆరోపిస్తూనే ఉంది. ప్రపంచంలో అత్యధిక కరోనా బాధితులు, మరణాలు నమోదైన దేశంగా అమెరికా రికార్డులకెక్కడంతో ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనాపై తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. చైనాతో మాకు మంచి సంబంధాలే ఉన్నాయంటూనే ప్రతీకార చర్యలకు సిద్దపడుతున్నారు. డబ్ల్యూహెచ్‌వోను అడ్డం పెట్టుకొని చైనాపై ట్రంప్ పలు ఆరోపణలు చేశారు.ఈ విషయంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ వివరణ ఇచ్చినా ట్రంప్ కోపాగ్ని మాత్రం చల్లారలేదు. ఇదే సమయంలో ‘చైనా టెలికాం’ సంస్థతో అమెరికా దేశ భద్రతకు ముప్పుందని దానిపై నిషేధానికి సిద్దపడింది. ప్రస్తుతం అమెరికాలో చైనా టెలికాం సేవలు అందిస్తోంది. ఈ సంస్థపై ఆంక్షలు విధించడంతో పాటు అనుమతులు రద్దు చేయాలని ఫెడరల్ కమ్యునికేషన్ కమిషన్‌కు అమెరికా రక్షణ, హోం, వాణిజ్య సహా పలు అత్యున్నత శాఖలు విజ్ఞప్తి చేశాయి. చైనా టెలికాం వల్ల దేశ రక్షణకు ముప్పుందని.. వెంటనే దాని లైసెన్సులు రద్దు చేయాలని అమెరికా న్యాయశాఖ ఒక ప్రకటన కూడా విడుదల చేసింది. కాగా, ఎఫ్‌సీసీ కనుక ఈ విజ్ఞప్తిని మన్నించి లైసెన్సు రద్దు చేస్తే.. చైనా టెలికాం సేవలు పొందుతున్న లక్షలాది మంది మొబైల్, ఇంటర్నెట్ వినియోగదారులు ఆయా సేవలకు దూరం కావల్సి వస్తుంది. చైనా టెలికాంపై గూఢచర్యం ఆరోపణలు కూడా వస్తుండటంతో ఎఫ్‌సీసీ ఏ నిర్ణయం తీసుకుంటుందనే దానిపై ఆసక్తి నెలకొంది.
Tags: coronavirus, us, china, helpful, retaliation, trump, telecom