నా భర్త ఉగ్రవాది? : హీరోయిన్ ఊర్మిళ

by Anukaran |   ( Updated:2020-12-19 01:58:12.0  )
నా భర్త ఉగ్రవాది? : హీరోయిన్ ఊర్మిళ
X

దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ హీరోయిన్ ఊర్మిళ మటోండ్కర్ సోషల్ మీడియాలో వస్తున్న ట్రోల్స్‌పై స్పందించారు. తన భర్త మొహ్సిన్ అక్తర్, అతని కుటుంబంపై నిరంతరం ట్రోల్స్ జరుగుతూనే ఉన్నాయని, ఇది నిజంగా దురదృష్టకరమని అన్నారు. మొహ్సిన్ ముస్లిం.. కాశ్మీరీ ముస్లిం.. అని తెలిపిన ఊర్మిళ, తనను పాకిస్థాన్‌కు చెందిన ఉగ్రవాదిగా అభివర్ణిస్తూ సోషల్ మీడియాలో కామెంట్స్ వస్తూనే ఉన్నాయంది. తన కుటుంబం గురించి ఎప్పుడూ ఏదో ఒక విమర్శ ఎదురు అవుతుండడం బాధగా ఉందని తెలిపింది.

మరో వైపు తన వికీపీడియా పేజీని కూడా దుండగులు మార్చేశారని.. తల్లి పేరు రుక్సానా అహ్మద్ అని, తండ్రి పేరు శివిందర్ సింగ్ అని పెట్టారని తెలిపింది. అసలు ఆ ఇద్దరు ఎవరో? వాళ్లు భారతదేశంలో ఎక్కడ ఉంటారో కూడా తెలియదన్న ఊర్మిళ.. తన తండ్రి పేరు శ్రీకాంత్ మటోండ్కర్, తల్లి పేరు సునీతా మటోండ్కర్ అని చెప్పింది. ఇలాంటి ఘటనలు తనను హార్ష్‌గా బిహేవ్ చేసేలా మారుస్తున్నాయని తెలిపింది. ఒక మహిళ సాధారణంగా సున్నితంగా ఉంటుందని.. కానీ ఈ తరహా ఇన్సిడెంట్స్ ఎదురైనప్పుడు కఠినంగా ప్రవర్తించాల్సి వస్తుందని హెచ్చరించింది. కాగా ఊర్మిళ, మొహ్సిన్ మార్చి 2016లో ఓ ప్రైవేట్ సెరమనీలో పెళ్లి చేసుకున్నారు. ప్రముఖ డిజైనర్ మనీష్ మల్హోత్ర కోడలు పెళ్లికి అటెండ్ అయిన ఈ ఇద్దరు.. ఫస్ట్ టైమ్ కలిసి మీడియాకు పోజిచ్చారు.

Advertisement

Next Story

Most Viewed