- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఇక ద్రవరూపంలో యూరియా : మంత్రి శ్రీనివాస్ గౌడ్
దిశ, మహబూబ్‌నగర్: గతంలో మాదిరి కాకుండా యూరియా ద్రవరూపంలో లభించనున్నట్లు రాష్ట్ర ఎక్సైజ్, క్రీడలు, సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. ద్రవ రూపంలో ఉండే యూరియాను నీటిలో కలిపి పంట పొలాలపై పిచికారీ చేయాలని, గతంలో గుళికల రూపంలో ఉన్న యూరియా వల్ల ఎలాంటి ఫలితం ఉంటుందో ద్రవ రూప యూరియా వల్ల కూడా అలాంటి ఫలితమే ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఇఫ్కో కంపెనీ తయారు చేసిన ద్రవ రూప యూరియాను గురువారం ఆయన మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో విడుదల చేసారు.
250 మిల్లీలీటర్ల బాటిల్ తో కూడుకున్న ఈ ద్రవ రూప యూరియా 45 కిలోల యూరియా బస్తా తో సమానమని మంత్రి తెలిపారు. గుళికల రూపంలో యూరియా తయారీ, బస్తాలలో ప్యాకింగ్ చేయటం, రవాణా వంటి ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని వాటిని అధిగమించేందుకు ఇఫ్కో కంపెనీ ద్రవ రూపంలో యూరియాను తయారు చేసిందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఫర్టిలైజర్ కంట్రోల్ ఆర్డర్ ధ్రువీకరించిన మీదట, కేంద్ర ప్రభుత్వం ఆమోదం మేరకు ఇది విడుదల చేసిందని ఆయన వెల్లడించారు. ఈ ద్రవ రూప యూరియాను నీళ్లలో కలిపి రైతులు పంట పొలాలపై పిచికారీ చేయాలని, 250 మిల్లీలీటర్ల బాటిల్ 125 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేస్తే సరిపోతుందని ఆయన తెలిపారు.
మొదటిసారిగా రాష్ట్రంలో ఇఫ్కో కంపెనీ ద్రవరూప యూరియాను వాడుకలోకి తీసుకు వచ్చిందని ఆయన వెల్లడించారు. గుజరాత్‌లో ఉన్న ఇఫ్కో కంపెనీ ద్వారా ఈ ఉత్పత్తులు జరుగుతుండగా, తొలిసారిగా రాష్ట్రంలో వినియోగిస్తున్నారని తెలిపారు. జిల్లాలోని భూత్పూరు, తదితర మండలాల్లో డెమో కార్యక్రమం కూడా చేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట రావు, జిల్లా ఎస్పీ ఆర్.వెంకటేశ్వర్లు, జిల్లా వ్యవసాయ అధికారిని సుచరిత, ఇఫ్కో కంపెనీ జిల్లా ప్రతినిధి బాలాజీ, వ్యవసాయ అధికారి కొమురయ్య, డీసీసీబీ చైర్మన్ నైజాం పాషా తదితరులు హాజరయ్యారు.