‘ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి రెట్టింపు ఆదాయం’

by Harish |
‘ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి రెట్టింపు ఆదాయం’
X

దిశ, వెబ్‌డెస్క్: కరోనాకు ముందునాటి స్థాయిలో బలమైన రికవరీని సాధించగలమని హోమ్ సర్వీసెస్ సంస్థ అర్బన్ కంపెనీ ఆదివారం తెలిపింది. గతేడాదితో పోలిస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రెట్టింపు ఆదాయం ఆశిస్తున్నట్టు కంపెనీ అభిప్రాయపడింది. డిమాండ్ పెరుగుదలకు అనుగుణంగా భాగస్వామ్యం ద్వారా సంస్థ మరింత పటిష్టమయ్యేందుకు కృషి చేస్తున్నట్టు అర్బన్ కంపెనీ సహ-వ్యవస్థాపకుడు వరుణ్ ఖైతాన్ చెప్పారు.

‘లాక్‌డౌన్ సమయంలో తాము సురక్షితమైన, పరిశుభ్రత కలిగిన సేవలను అందించడంపై దృష్టి కేంద్రీకరించాం. సాంకేతికత, పీపీఈ పరికరాలు, భద్రతా శిక్షణలో గణనీయమైన పెట్టుబడులను పెట్టామని’ ఆయన వివరించారు. జూన్ నెల నుంచి సంస్థ వ్యాపారం సానుకూలంగా ఉంది. వినియోగదారులు బయటికి వెళ్లడం కంటే ఇంటి వద్దే తమ సేవలను పొందేందుకు అర్బన్ కంపెనీని ఆశ్రయిస్తున్నారని చెప్పారు. లాక్‌డౌన్ ఎక్కువ నెలలు ఉన్నప్పటికీ బలమైన వృద్ధిని సాధించాం. తాము ఇప్పటికే కరోనాకు ముందునాటి స్థాయిని దాటి 30 శాతానికిపైగా వృద్ధిని దక్కించుకున్నాం, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసే సమయానికి రెండు రెట్లు పెరుగుతుందని నమ్ముతున్నట్టు ఆయన చెప్పారు.

Advertisement

Next Story