మెగా ప్రిన్స్ ‘గని’లో స్టార్ హీరోలు!

by Jakkula Samataha |
varuntej
X

దిశ, సినిమా: ‘గద్దలకొండ గణేష్’ వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటిస్తున్న చిత్రం ‘గని’. కిక్ బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో వరుణ్ ఇంటెలిజెంట్ బాక్సర్‌గా కనిపించబోతున్నాడు. కాగా అల్లు అరవింద్ సమర్పణలో అల్లు బాబీ, సిద్ధు ముద్దా నిర్మిస్తున్న సినిమాను కిరణ్ కొర్రపాటి డైరెక్ట్ చేస్తున్నారు. ఇక కాస్టింగ్‌ విషయానికొస్తే.. ఈ చిత్రంలో కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర, సునీల్ శెట్టి, జగపతిబాబు, నవీన్ చంద్ర ప్రధాన పాత్రల్లో కనిపించబోతున్నారు. ఈ మూవీకి సంబంధించి ఎంటర్‌టైన్మెంట్ ప్లస్ ఎక్స్‌ట్రార్డినరీ యాక్షన్ సీక్వెన్స్‌లు మెయిన్ ఎస్సెట్ కానున్నాయని తెలిపారు మేకర్స్. ప్రస్తుతం చిత్ర షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతుండగా.. సెకండ్ షెడ్యూల్‌లో భాగంగా ఉపేంద్ర ఈ రోజు(గురువారం) షూటింగ్‌లో జాయిన్ అయినట్లు ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు. వరుణ్‌కు జోడీగా సాయి మంజ్రేకర్ నటిస్తుండగా, ఎస్.ఎస్.థమన్ మ్యూజిక్ అందిస్తున్నారు.

https://twitter.com/UrsVamsiShekar/status/1362301592007942146?s=20

Advertisement

Next Story

Most Viewed