చెట్టుకు కట్టేసి సజీవదహనం

by Shamantha N |   ( Updated:2020-06-02 07:13:32.0  )
చెట్టుకు కట్టేసి సజీవదహనం
X

లక్నో: ఉత్తరప్రదేశ్‌లో దారుణం చోటుచేసుకుంది. ప్రతాప్‌గఢ్ జిల్లాలో సోమవారం రాత్రి ఓ యువకుడిని ఇంట్లో నుంచి బయటకు లాక్కొచ్చి, చెట్టుకు కట్టేసి సజీవ దహనం చేశారు. ఘటన గురించి తెలుసుకుని అక్కడికి వచ్చిన పోలీసులపైనా దాడి చేశారు. ఓ మహిళతో సదరు యువకుడి శారీరక సంబంధమే ఈ దాడికి కారణంగా తెలుస్తున్నది. వివరాల్లోకి వెళితే.. అంబికా ప్రసాద్ పటేల్ అనే యువకుడు పొరుగునే ఉండే ఓ మహిళతో గతేడాది కాలంగా ప్రేమలో ఉన్నాడు. ఈ వ్యవహారం మహిళ కుటుంబీకులకు గిట్టలేదు. కాగా, ఇటీవలే ఆమె కానిస్టేబుల్‌గా ఎంపికవ్వగా అంబికా ప్రసాద్ పటేల్ ఆ మహిళకు సంబంధించిన అసభ్యకరమైన ఫొటోలు సోషల్ మీడియాలో పోస్టు చేసినట్టు సమాచారం. మహిళ ఫిర్యాదుతో అంబికా ప్రసాద్ పటేల్‌ జైలుకు వెళ్లాడు. కానీ, జైల్లో సామాజిక దూరాన్ని పాటించే నిర్ణయాల్లో భాగంగా అంబికా ప్రసాద్ పటేల్ పెరోల్‌పై ఇంటికొచ్చాడు. ఈ నేపథ్యంలోనే మహిళ కుటుంబీకులు, ఇరుగుపొరుగు దాడికి పాల్పడినట్టు తెలిసింది.

Advertisement

Next Story