- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
ఇంట్లోనే ముత్యాల సాగు
దిశ, ఫీచర్స్ : ప్రకృతిసిద్ధంగా లభించే జాతి రత్నాల్లో ముత్యం ఒకటి. ఇందులో మంచి నీటిలో ఏర్పడ్డవి, ఉప్పు నీళ్ళలో తయారైనవి అంటూ రెండు రకాల ముత్యాలున్నాయి. కానీ కాలుష్య కారకాల వల్ల ముత్యాల సహజ ఉత్పత్తి తగ్గిపోతుండటం మూలాన అవి చాలా తక్కువ మొత్తంలో లభ్యమవుతున్నాయి. ధర కూడా పెరిగిన నేపథ్యంలో కృత్రిమ ముత్యాలకు డిమాండ్ బాగా పెరిగింది. అందుకే మనదేశం ప్రతి ఏటా కల్చర్డ్ ముత్యాలను భారీఎత్తున దిగుమతి చేసుకుంటోంది. ఈ సంగతి పక్కనబెడితే, వివిధ రకాల పద్ధతులను అనుసరించి ఎవరైనా ఇంట్లోనే నాణ్యమైన ముత్యాలను ఉత్పత్తి చేయొచ్చు. ఈ నేపథ్యంలోనే ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన పెరల్ ఎక్స్‌పర్ట్ జితేందర్ చౌదరి ఇంట్లోనే ముత్యాల పంట పండిస్తూ లాభాలు ఆర్జిస్తున్నాడు.
పాండమిక్ తర్వాత చాలా మంది పట్టభద్రులు, ఉద్యోగులు వ్యవసాయం చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే వాళ్లంతా వాణిజ్య, ఆహార పంటల సాగుకే ఆసక్తి చూపిస్తున్నారు. కానీ ఘజియాబాద్‌లోని ఖురాంపూర్ గ్రామంలో నివసిస్తున్న జితేందర్ చౌదరి మాత్రం ఇందుకు భిన్నం. దశాబ్దం క్రితం తమ ఇంట్లోనే వాణిజ్య స్థాయిలో ముత్యాల సాగును ప్రారంభించి, మిగతా రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు. వ్యవసాయ కుటుంబానికి చెందిన జితేందర్.. కంప్యూటర్ అప్లికేషన్‌లో పోస్ట్ గ్రాడ్యుయేట్ చేశాడు. ఏదైనా కొత్తగా ప్రయత్నించాలనే ఆకాంక్షే జితేందర్‌ను ముత్యాలు సాగు వైపు నడిపించగా.. 2009లో రూ .20,000 ప్రారంభ పెట్టుబడితో దీన్ని ప్రారంభించాడు. ప్రస్తుతానికి జితేందర్.. సిమెంట్ టబ్స్, చేపల తొట్టె(ఫిష్ ట్యాంక్స్)ల్లో పెరల్స్ పెంచుతుండగా, ముత్యాల సాగు కోసం అతడు ఉపయోగిస్తున్న పద్ధతిని రీసర్క్యూలేటింగ్ ఆక్వాకల్చర్ సిస్టమ్ (RAS) అంటారు.
ఆర్ఏఎస్ పద్ధతిలో చేపల తొట్టెల్లోని నీటిని ఫిల్టర్ చేస్తారు. ఈ విధానంలో ముత్యాల సాగు చేయడం వల్ల స్పేస్ తగ్గుతుండటంతో పాటు నీటి వినియోగం కూడా చాలా వరకు తగ్గుతోంది. అంతేకాదు పెరల్ కల్చర్‌లో ప్రధానంగా ఎదుర్కొనే వేస్ట్ మేనేజ్‌మెంట్, అమ్మోనియా టాక్సిసిటీ సమస్యలకు ఈ పద్ధతి పరిష్కారం చూపుతోంది. అందుకే దీన్ని చెరువులు, ఇతర ట్యాంకుల కంటే మెరుగైన వ్యవస్థగా చెప్పొచ్చు. ‘చెరువులో ముత్యాలు సాగు చేయాలంటే.. కనీస పరిమాణంతో పాటు ఆరు నెలల పాటు ఆ చెరువు వినియోగంలో ఉండాలి. అక్కడి వాతావరణానికి ముస్సెల్స్ తట్టుకుని ప్రాణాలతో ఉంటేనే ముత్యాలసాగు చేయొచ్చు. పైగా చెరువులో ఉష్ణోగ్రతను నియంత్రించడం సాధ్యం కాదు. అదే చేపల తొట్టెలో అయితే ఉష్ణోగ్రతను కంట్రోల్ చేయవచ్చు. అంతేకాదు ముస్సెల్స్‌కు అవసరం మేరకు ఆల్గేను అందించవచ్చు. ఎప్పటికప్పుడు పెరల్స్ పెరుగుదలను తనిఖీ చేయవచ్చు.
జపాన్ దేశానికి చెందిన మికీమోటో 1893 జులై 11న తొలిగా కృత్రిమ ముత్యాలను తయారు చేసింది. కాగా ఇంట్లోనే కృత్రిమంగా ముత్యాలను సాగు చేయాలంటే, ముత్యాల రకాలను గుర్తించడానికి వీలుగా తగిన కోర్సు చేస్తే బాగుంటుందని పెరల్ కల్చర్ నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు వాణిజ్య ప్రయోజనాల కోసం ముత్యాలను పండించాలనుకుంటే అందుకోసం లైసెన్స్ తీసుకోవాలి. ఇక తక్కువ నాణ్యత గల ముస్సెల్స్ ఉపయోగిస్తే వాటికి 65 రోజుల పాటు ప్రత్యేక దాణా, ఖనిజాలను అందించాలి. అయితే హైక్లాస్ ముస్సెల్స్ ఉపయోగిస్తే ముత్యాలు 20 రోజుల వ్యవధిలోనే హార్వెస్ట్ అవుతాయి.
కేరళకు చెందిన 65 ఏళ్ల కె.జె. మతచన్.. గత రెండు దశాబ్దాలుగా పశ్చిమ కనుమల్లో ఉద్భవించిన నదుల నుంచి సేకరించిన మంచినీటి మస్సెల్స్ ఉపయోగించి ముత్యాలను పండిస్తున్నారు. వీటి ద్వారా ఏటా 50 బకెట్ల ముత్యాలను ఉత్పత్తి చేస్తున్నారు. ఇవి ఆస్ట్రేలియా, సౌదీ అరేబియా, కువైట్, స్విట్జర్లాండ్ వంటి దేశాలకు ఎగుమతి అవుతున్నాయి. అంతేకాదు మతచన్.. పెరల్స్ కల్టివేషన్‌పై ఆన్‌లైన్ క్లాసులు కూడా నిర్వహిస్తుండటం విశేషం. ఇక బిహార్‌లోని టెటారి గ్రామంలో జన్మించిన జైశంకర్ కుమార్ కూడా పెరల్ కల్టివేషన్‌లో అద్భుతాలు చేసి కోటీశ్వరుడయ్యాడు. ప్రధాని మోదీ కూడా జైశంకర్ గురించి తన ‘మన్ కీ బాత్’లో ప్రస్తావించాడు. కెమిస్ట్రీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన జైశంకర్.. ఎకరం చెరువులో ముత్యాల పెంపకంతో లక్ష వరకు సంపాదించవచ్చునని 2009లోనే నిరూపించాడు. ఈ క్రమంలోనే ఆగ్రాకు చెందిన రంజనా యాదవ్ 2018లో తన అత్తవారింట్లోనే పెరల్ కల్టివేషన్ చేసి రూ.80 వేలు సంపాదించింది. ఆమె ఏడాది కాలంలోనే దాదాపు 18 మందికి పెరల్ కల్టివేషన్‌లో శిక్షణిచ్చి అందరితో శభాష్ అనిపించుకుంది.
పెరల్ కల్టివేషన్ చేసే ముందు ఈ సాగు విధానం గురించి నేను ఆన్‌లైన్‌లో కొంత సెర్చ్ చేయడంతో పాటు ఒడిశాలోని సెంట్రల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్రెష్‌వాటర్ ఆక్వాకల్చర్ (సిఫా) అందించే కోర్సు చేశాను. ఇక మార్కెట్లో కొత్త ముత్యాలు వస్తున్నప్పుడు, వాటి గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. దాని కోసం అనేక వర్క్‌షాప్‌లు, తరగతులకు హాజరుకావడం కూడా ప్రధానమే.- జితేందర్ చౌదరి
ముత్యాల పెంపకానికి నైపుణ్యంతో కూడిన పరిజ్ఞానం అవసరం. కాబట్టి సరైన విషయ పరిజ్ఞానం లేకపోతే భారీ నష్టాలు సంభవించే అవకాశం ఉంది. ఈ కోర్సు నిర్వహణపై సైద్ధాంతిక, ఆచరణాత్మక విద్యను అందిస్తుంది. భిన్నమైన ప్లాంటేషన్ మెథడ్స్‌కు సంబంధించిన మాంటిల్ కేవిటీ, మాంటిల్ టిష్యూలతో పాటు గోనాడల్ ఇంప్లాంటేషన్‌లో కూడా శిక్షణ ఇస్తారు’ -డాక్టర్ శైలేష్ సౌరభ్, సిఫా సీనియర్ సైంటిస్ట్ ఆక్వాకల్చర్ అండ్ ఫిష్ ఇమ్యునాలజీ