రాహుల్, దీదీ ఆలయాలకు ఎందుకు ‘క్యూ’ కడ్తున్నారంటే? : యోగి

by Shamantha N |
రాహుల్, దీదీ ఆలయాలకు ఎందుకు ‘క్యూ’ కడ్తున్నారంటే? : యోగి
X

దిశ, వెబ్‌డెస్క్ : పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికల ప్రచారం జోరందుకుంది. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు అన్ని పార్టీలు దూకుడుగా వ్యవహరిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే మంగళవారం బెంగాల్‌లో బీజేపీ పార్టీ ప్రచారం నిర్వహించగా, స్టార్ క్యాంపెనర్‌గా ఉత్తరప్రదేశ్ సీఎం యోగిఆదిత్యనాధ్ విచ్చేశారు. ప్రచారంలో భాగంగా ఆయన మాట్లాడుతూ.. 2014లో బీజేపీ అధికారంలోనికి వచ్చాకే కాంగ్రెస్ నాయకుడు, ఎంపీ రాహుల్ గాంధీ, బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆలయాలకు వెళ్తున్నారని వ్యాఖ్యానించారు.

ఎన్నికలు జరిగే సమయంలో మాత్రమే వీరు బలవంతంగా టెంపుళ్లకు వెళ్తారని, లేకపోతే వీరికి ఆలయాలన్నా.. దేవుళ్ళన్నా నమ్మకం లేదన్నారు. ఎన్నికలు రాకపోతే వీరికి దేవుడు అంటే ఎవరో కూడా తెలీదని సీఎం యోగి విమర్శలు గుప్పించారు. కేవలం ఓట్ల కోసమే రాహుల్, దీదీ ఆలయాలకు వెళ్తున్నారని.. దేవుడి మీద తమకు నమ్మకం ఉన్నట్లు హిందూ ఓటర్లను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.

Advertisement

Next Story

Most Viewed