- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
భారీ భద్రత నడుమ దళిత బాలికలకు అంత్యక్రియలు.. అసలేమైంది..!
లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్ జిల్లాలో బుధవారం అనుమానాస్పద స్థితిలో విగతజీవులై కనిపించిన ఇద్దరు దళిత బాలికల మృతదేహాలకు భారీ భద్రత నడుమ శుక్రవారం అంత్యక్రియలు నిర్వహించారు. విషం తీసుకుని మరణించి ఉండవచ్చని పోలీసులు చెబుతుండగా, కుటుంబ సభ్యులు పోలీసుల వాదనతో విబేధిస్తున్నారు. బాలికల మెడకు దుపట్టా కట్టి ఉన్నదని, వారి దుస్తులు చినిగి ఉన్నాయని, వారు విషం తీసుకునే అవకాశమే లేదని చెబుతున్నారు. ఉన్నావ్‌లోని బాబుహరా గ్రామానికి చెందిన ముగ్గురు బాలికలు(14,5,16 ఏళ్ల వయసు) బుధవారం సాయంత్రం పశువు మేత కోసం పొలానికి వెళ్లారు.
కానీ, తిరిగిరాకపోవడంతో కుటుంబీకులు వెతుక్కుంటూ పొలం దగ్గరకు వెళ్లారు. అక్కడ ముగ్గురూ అపస్మారక స్థితిలో పడి ఉండగా హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. అప్పటికే ఇద్దరు మృతిచెందారని వైద్యులు చెప్పగా, మరో బాలికను కాన్పూర్ హాస్పిటల్‌కు తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం ఇంకా విషమంగానే ఉన్నది. పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయడంలో నిర్లక్ష్యం ప్రదర్శించినా, కుటుంబీకులు పట్టుబట్టడంతో గుర్తుతెలియనివారిపై హత్యానేరం, ఆధారాల చెరిపివేత కింద ఎఫ్ఐఆర్ నమోదుచేశారు. వారి శరీర అవయవాలు రసాయనిక విశ్లేషణల కోసం పంపామని, పోస్టుమార్టం రిపోర్టులో బయటినుంచి వారిపై దాడి జరిగినట్టు ఆధారాలు లభించలేదని పోలీసులు తెలిపారు. తమ పిల్లలపై అఘాయిత్యం జరిగినట్టు అనుమానమున్నదని, సరైన విధంగా దర్యాప్తు చేయాలని కుటుంబీకులు కోరుతున్నారు.