యునైటెడ్ ఎయిర్‌లైన్స్ విమానానికి తప్పిన ప్రమాదం

by vinod kumar |
యునైటెడ్ ఎయిర్‌లైన్స్ విమానానికి తప్పిన ప్రమాదం
X

దిశ, వెబ్‌డెస్క్: యునైటెడ్ ఎయిర్‌లైన్స్ విమానానికి పెను ప్రమాదం తప్పింది. టేకాఫ్ అయిన కొద్ది నిమిషాల్లోనే విమానం కుడి ఇంజిన్‌లో పేలుడు సంభవించి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో అప్రమత్తమైన పైలట్లు అత్యవసరంగా తిరిగి ల్యాండింగ్ చేశారు.

డెన్వర్ ఇంటర్‌నేషనల్ ఎయిర్‌పోర్టు నుంచి బొయింగ్ 777-200 విమానం హోనోలులకు బయలు దేరింది. ఈ క్రమంలో టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఇంజిన్‌లో సాంకేతిక లోపం తలెత్తిందని.. భారీ పేలుడు జరిగినట్లు పైలెట్ వెల్లడించాడు. దీంతో అదే విమానాశ్రయంలో తిరిగి ల్యాండ్ అయింది. విమానం ఇంజిన్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ప్రయాణికులంతా ఆందోళనకు గురయ్యారు. ఎలాంటి ప్రమాదం లేకుండా బయటపడడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదం సమయంలో విమానంలో 231 మంది ప్రయాణికులు, 10 మంది సిబ్బంది ఉన్నారు. విమానం ఎగురుతున్న సమయంలో కొన్ని శకలాలు ఓ ఇంటి బయట చెల్లాచెదురుగా పడ్డాయి. కాగా, విమాన ప్రమాదంపై ఆ విమానం లోపలి నుంచి తీసిన వీడియో సోషల్ మీడియాల్లో వైరల్‌గా మారింది.

Advertisement

Next Story