- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మహిళలకు గుడ్‌న్యూస్.. తెలంగాణలో కేంద్రమంత్రి కీలక ప్రకటన
దిశ ప్రతినిధి, మెదక్: బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అందరూ కలిసి టీఆర్ఎస్ అరాచక పాలనకు చరమగీతం పాడాలని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ పిలుపునిచ్చారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ చేపట్టిన తొలి విడత ‘ప్రజా సంగ్రామ యాత్ర’ హుస్నాబాద్‌లో ముగిసింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభకు ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆమె మాట్లాడుతూ.. నీళ్ళు, నియామకాలు, నిధులు కోసం ఏర్పడిన ఈ రాష్ట్రం పక్క దారి పట్టిందని, రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య బాగా పెరిగిందన్నారు. ప్రధాని మోడీ చల్లని దయ వల్ల రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ సాకారం చేసి తెలంగాణ రైతులకు యూరియా అందించారన్నారు. తెలంగాణ ప్రజల సేవకోసం బీజేపీ నాయకులు కార్యకర్తలు కట్టుబడి ఉన్నారన్నారు. ఈ దేశంలో ఒక్క మనిషి ఆకలితో ఉండకూడదని ఉచితంగా రేషన్ అందిస్తున్న ఏకైక ప్రభుత్వం మోడీ ప్రభుత్వమన్నారు. తెలంగాణ నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి రూ. వేలు ఇస్తామని చెప్పి ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. తెలంగాణ విమోచన దినోత్సవం అధికారికంగా చేస్తా అని చెప్పిన టీఆర్ఎస్ మరిచిందని, దానికి కారణం టీఆర్ఎస్ స్టీరింగ్ ఎంఐఎం చేతుల్లో ఉండటమేనని ఎద్దేవా చేశారు. దళితులకు కేసీఆర్ మొండి చెయ్యి చూపిస్తున్నాడని, మోడీ ఫసల్ బీమా యోజన పథకం ద్వారా రైతులకు ప్రయోజనం చేకూరిందన్నారు. ధర్మం కోసం, ధర్మంగా బండి సంజయ్ యాత్ర చేస్తున్నారని, తెలంగాణ ప్రజలకు కోరుకునేది బీజేపీ పార్టీని మాత్రమేనని, హుజురాబాద్ ఉప ఎన్నికల్లో బీజేపీకి ఓటేసి భారీ మెజార్టీతో ఈటలను గెలిపించాలని కోరారు. అంతేగాకుండా.. మహిళల కోసం కేంద్ర ప్రభుత్వం తరుపున స్వశక్తి లోన్స్ అందజేస్తామని హామీ ఇచ్చారు.
అనంతరం బండి సంజయ్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తొలి సంతకం ఉచిత వైద్యం, విద్యపైనే పెడతామని బండి సంజయ్ అన్నారు. 2023 ఎన్నికల్లో కేసీఆర్ గడీలను బద్దలు కొట్టి ప్రజాపాలనను తీసుకొస్తామని స్పష్టం చేశారు. మోడీ ఆశీర్వాదంతో పోరాటాలు, త్యాగాలు అవసరం లేకుండా టీఆర్ఎస్ బాక్సులు బద్దలు కొట్టడం ఖాయమన్నారు. తెలంగాణలో డిగ్రీ చదువుతున్న విద్యార్థులు ఉపాధి కూలీ పనులు చేసుకునే దుస్థితి రావడం బాధాకరమన్నారు. ధరణి కేసీఆర్ భరినిగా మారిందని విమర్శించారు. ప్రాజెక్టుల కోసం భూములిస్తే.. ఆర్అండ్ఆర్ ప్యాకేజీ ఇవ్వకుండా వాళ్ల బతుకులు ఆగం చేశాడని ఆవేదన వ్యక్తం చేశారు. యాత్రలో అడుగడుగునా ప్రజలు తమ కష్టాలు, బాధలు చెప్పుకున్నారని చెప్పారు. సర్పంచులకు నిధులు లేవు, ఉద్యోగులకు జీతాలు లేవు, నిరుద్యోగులకు నోటిఫికేషన్లు లేవని ఆవేదన వ్యక్తం చేశారు. 80 శాతం ఉన్న హిందువుల గురించి మాట్లాడితే మతత్వమా? అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. తాలిబన్ల రాజ్యం తెస్తామన్న ఎంఐఎం పాలన కావాలా? లేక రామ రాజ్యం తెస్తామన్న బీజేపీ కావాలా? తెలంగాణ ప్రజలు తేల్చుకోవాలన్నారు. బైంసాలో మరోసారి కలహాలు సృష్టిస్తే అక్కడే బహిరంగ సభ నిర్వహిస్తామన్నారు. హుజురాబాద్ మనదేనని, ఆ తర్వాత తెలంగాణ మనదేనని నాయకుల్లో ఉత్తేజం నింపారు.
మాజీ మంత్రి, హుజురాబాద్ బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. హుజురాబాద్‌లో కురుక్షేత్ర యుద్ధం జరుగుతోందని, ఈ యుద్ధంలో ధర్మమే గెలుస్తుందని అన్నారు. గత ఐదునెలలుగా హుజరాబాద్‌లో అంబేద్కర్ రాజ్యాంగం అమలు కావట్లేదని, కేసీఆర్ రాజ్యాంగం అమలవుతున్నదని విమర్శించారు. వందల కోట్లతో మనుషులకు విలువ కడుతున్నారని, ఇన్నేండ్ల స్వాతంత్ర్య చరిత్రలో మొదటిసారి వేల కోట్లు ఖర్చు చేసి రాజేందర్‌ను ఓడించే కుట్ర చూస్తుంటే సిగ్గేస్తుందన్నారు. ఇంత చేసినా హుజురాబాద్ ప్రజలు తమ వైపే ఉన్నారని, ఈ నెల 30 నజరుగుతున్న కురుక్షేత్ర యుద్ధంలో ధర్మం గెలుస్తుందన్నారు. కేసీఆర్ అహంకారానికి హుజురాబాద్ ప్రజలకు పోరాటం జరుగుతోందని, దొంగ లేటర్లు సృష్టించి కుట్రలకు తెర లేపిన టీఆర్ఎస్‌ను ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు. ఈ సభలో బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్, జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, ఎమ్మెల్యేలు రఘునందన్ రావు, రాజాసింగ్, యాత్ర ప్రముఖ్ గంగిడి మోహన్ రెడ్డి, నాయకులు వివేక్ వెంకట స్వామి, పొంగులేటి సుధాకర్ రెడ్డి పాల్గొన్నారు.