- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఆటో ఇండస్ట్రీ దిగ్గజాలతో జవదేకర్ కాన్ఫరెన్స్
న్యూఢిల్లీ: ఆటో ఇండస్ట్రీ దిగ్గజాలతో కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ గురువారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశమయ్యారు. నోవెల్ కరోనా వైరస్ (కొవిడ్ 19) కట్టడికి విధించిన లాక్‌డౌన్ పూర్తయిన తర్వాత ఆటో ఇండస్ట్రీ కార్యకలాపాలు తిరిగి ప్రారంభించేందుకు అవసరమైన సూచనలు, సలహాలు అడిగి తెలుసుకున్నారు.
అనంతరం మీడియాతో కేంద్ర మంత్రి మాట్లాడుతూ,దేశ జీడీపీలో గణనీయమైన వాటా ఆటో పరిశ్రమదేననీ, గతేడాది బీఎస్-6 నిబంధనలు అమల్లోకి తేవడం వల్ల పరిశ్రమపై కొంత ప్రభావం పడించదని చెప్పారు. ఈ నిబంధనల మార్పుతో వాహనాలు కొనుగోలు చేయాలనుకున్న వారు తమ నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నారని తెలిపారు. జీఎస్‌టీ కోత, ఉద్యోగుల సహకారం, రిటైల్ చైన్ సపోర్ట్, సప్లయిర్లు, లిక్విడిటీ సపోర్ట్ సహా పలు అంశాలపై సమావేశంలో చర్చించామనీ, విధుల్లో చేరడానికి ముందు ఉద్యోగులకు కొవిడ్ పరీక్షలు నిర్వహించడం, సామాజిక దూరం పాటించేలా చూడటం వంటి అంశాలు కూడా సమావేశంలో చర్చకు వచ్చినట్టు చెప్పారు. వీడియో కాన్ఫరెన్స్‌లో రాజన్ వథేర, కెనిచి అయుకవ, ఆర్సీ భార్గవ, శైలేజ్ చంద్ర తదితర ఆటో ఇండస్ట్రీ దిగ్గజాలు పాల్గొన్నారు.
Tags: video conference, union minister prakash javadekar, auto industry, heads, covid 19, lock down