- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
‘కరోనా, వర్షాలు మాకు అడ్డంకి కాదు’
దిశ, న్యూస్‌బ్యూరో: వర్షాలు, కరోనా పరిస్థితులు ఉన్నప్పటికీ థర్మల్ విద్యుత్ కేంద్రాలకు ఎటువంటి కొరత లేకుండా నిరంతరాయంగా బొగ్గు సరఫరా చేస్తున్నామని సింగరేణి సీఎండీ ఎన్.శ్రీధర్ కేంద్ర బొగ్గుశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషికి వివరించారు. దేశవ్యాప్తంగా బొగ్గు కంపెనీ ఛైర్మన్& ఎండీలతో కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి బొగ్గు ఉత్పత్తి, రవాణా అంశాలపై న్యూఢల్లీ నుంచి మంగళవారం నిర్వహించిన కాన్ఫరెన్సులో హైదరాబాద్‌లోని సింగరేణి భవన్ నుంచి సీఎండీ ఎన్.శ్రీధర్ పాల్గొన్నారు. గత ఏడాది కన్నా ఈ త్రైమాసిక కాలంలో 16శాతం వర్షం అధికంగా కురిసిందని, దీని ప్రభావం ఓపెన్ కాస్ట్ గనుల ఉత్పత్తిపై కొంతమేర ఉందని శ్రీధర్ వివరించారు.
కరోనా ప్రభావంతోనూ బొగ్గు ఉత్పత్తి కొంతమేర తగ్గిందని అయితే సింగరేణితో ఒప్పందం ఉన్న అన్ని థర్మల్ విద్యుత్ కేంద్రాలకు బొగ్గు సరఫరా సాధారణ స్థాయిలోనే జరుపుతున్నామని, ఇతర వినియోగదారులకు సైతం ఈ పోర్టల్ ద్వారా బొగ్గు సరఫరా చేస్తున్నామని వివరించారు. ఈ కార్యక్రమంలో సీఎండీతో పాటు అడ్వయిజర్ మైనింగ్ డి.ఎన్.ప్రసాద్, ఇ.డి (కోల్ మూమెంట్), జె.ఆల్విన్‌లు పాల్గొన్నారు.