- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నూతన సాగు చట్టాలతో రైతులకు మేలు :తోమర్
దిశ, వెబ్‌డెస్క్: కేంద్రం తీసుకొచ్చిన నూతన సాగు చట్టాలతో రైతులకు ఆదాయం పెరుగుతుందని వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ స్పష్టం చేశారు. ఈ చట్టం ద్వారా కనీస మద్దతు ధర ఉత్పాదక వ్యయం కన్నా 50 శాతం ఎక్కువగా ఉంటుందని తెలిపారు.
రాజ్యసభలో శుక్రవారం మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ మాట్లాడుతూ.. కొందరు వ్యక్తులు చట్టాలపై అవగాహన లేకుండా రైతులను రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు. నూతన సాగు చట్టాల్లో ఏవైనా లోపాలను చెప్పమంటే ప్రతిపక్షాలు, రైతులు చెప్పడం లేదని అడిగారు. వ్యవసాయ చట్టాల్లో సవరణలకు సిద్ధమని తెలిపారు. వ్యవసాయ రంగానికి అవసరమైన పెట్టుబడులు సమకూరే విధంగా కేంద్రం చర్యలు తీసుకుంటోందని అన్నారు. రైతులకు అనుకూలమైన ప్రభుత్వ పథకాలు గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్నవారి జీవితాల్లో మార్పు తీసుకొచ్చాయన్నారు. గ్రామ పంచాయతీలకు రూ.2.36 లక్షల కోట్లు ఆమోదించినట్లు తెలిపారు.