రెమిడెసివిర్ తెప్పిస్తా.. గాంధీ ఆస్పత్రి సందర్శనలో కిషన్ రెడ్డి

by vinod kumar |
రెమిడెసివిర్ తెప్పిస్తా.. గాంధీ ఆస్పత్రి సందర్శనలో కిషన్ రెడ్డి
X

దిశ, వెబ్‌డెస్క్: సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి శనివారం సందర్శించారు. ఆస్పత్రిలో బెడ్లు, ఆక్సిజన్ కొరత, ట్రీట్‌మెంట్ వివరాలు, మరణాలపై కిషన్ రెడ్డి ఆరా తీశారు. కేంద్రం నుంచి అందించాల్సిన సాయంపై గాంధీ ఆస్పత్రి సూపరింటెండ్‌తో చర్చలు జరిపారు. ఈ సందర్భంగా కేంద్రంతో మాట్లాడి రెమిడెసివిర్ తెప్పిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. గాంధీ ఆస్పత్రిలో ఆక్సిజన్ కొరతలేదని స్పష్టం చేశారు.

రాష్ట్రాలకు పంపిణీ చేస్తున్న వ్యాక్సినేషన్ కోటాలో తెలంగాణ వాటా పెంచాలని కేంద్రంతో మాట్లాడినట్టు తెలిపారు. వ్యాక్సిన్ దొరక్క ఎవరూ వెనక్కి పోవద్దు అని కిషన్ రెడ్డి హామీ ఇచ్చారు. దీనిపై రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్‌తో ఇప్పటికే మాట్లాడానని అన్నారు. కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేయాలని సూచించారు. ప్రజలు సామాజిక బాధ్యతగా మాస్కులు వేసుకుంటూ, భౌతికదూరం కచ్చితంగా పాటించాలని అన్నారు. కేంద్రంపై ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులు ఆరోపణలు చేయడం సరికాదని హితవు పలికారు.

Advertisement

Next Story