- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
టీకాలపై వదంతులు వ్యాప్తి చేస్తే చట్టపరమైన చర్యలు
న్యూఢిల్లీ: దేశంలో పంపిణీ చేస్తున్న కొవిషీల్డ్, కొవాగ్జిన్ టీకాలపై వదంతులు వ్యాప్తి చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్ర హోం శాఖ లేఖ రాసింది. తప్పుడు వార్తలు, అవాస్తవ సమాచారాన్ని అరికట్టడానికి రాష్ట్ర ప్రభుత్వాలు ఒక మెకానిజంను నిర్మించుకోవాలని, వీటిని ప్రచారం చేసే వారిపై విప్తతు నిర్వహణ చట్టం, భారత శిక్షా స్మృతిలోని అనువైన సెక్షన్ల కింద చర్యలు తీసుకోవాలని సూచించింది. ఈ రెండు టీకాలు సురక్షితమైనవని, రోగ నిరోధక శక్తిని కలుగజేస్తున్నాయని జాతీయ రెగ్యులేటరీ సంస్థ అనుమతించిందన్న విషయాన్ని విస్మరించవద్దని పేర్కొంది.
కేంద్ర హోం శాఖ కార్యదర్శి అజయ్ భల్లా రాష్ట్రాలకు రాసిన లేఖలో పేర్కొన్నారు. రెగ్యులేటరీ పరిశీలించి అనుమతించిన తర్వాత కూడా సోషల్ మీడియా, కొన్ని మీడియా సంస్థల్లో టీకాలపై అనుమానాలు రేకెత్తించే కథనాలు ప్రచారంలో ఉన్నాయని తెలిపారు. ఇలాంటి వదంతులు, ముఖ్యంగా దుష్ప్రయోజనాలను ఆశించి చేసే పుకార్లు ప్రజల్లో భయాందోళనలు సృష్టించవచ్చునని వివరించారు. కాబట్టి టీకాల సమర్థతపై జరుగుతున్న అవాస్తవ కథనాలకు చెక్ పెట్టాల్సిన అవసరమున్నదని స్పష్టం చేశారు. ఈ నెల 16వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా ఫ్రంట్‌లైన్ వర్కర్లకు టీకా పంపిణీ కార్యక్రమం మొదలైన సంగతి తెలిసిందే