ఆడబిడ్డ పుడితే అమ్మ పారేసిందా?

by Sumithra |   ( Updated:2023-07-08 12:52:28.0  )
ఆడబిడ్డ పుడితే అమ్మ పారేసిందా?
X

దిశ, వెబ్‌డెస్క్: వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం అమ్మపల్లిలో అమానుష ఘటన వెలుగు చూసింది. ఓ ఆడబిడ్డకు జన్మనిచ్చిన గుర్తు తెలియని మహిళ.. పుట్టిన బిడ్డను ఆదివారం సాయంత్రం ముళ్ల పొదల్లో పారవేసింది. ఈ హృదయవిదారక ఘటన స్థానికంగా అందరినీ కలచివేసింది. ఇదే సమయంలో అటుగా వస్తున్న వ్యవసాయ కూలీలు చెట్ల పొదల్లో ఉన్న పసిబిడ్డను గ్రహించి గ్రామ సర్పంచ్‌కు సమాచారం ఇచ్చారు. దీంతో సర్పంచ్‌తో పాటు ఆశా వర్కర్లు కూడా ఘటన స్థలానికి చేరుకొని అంబులెన్స్ సాయంతో పసిబిడ్డను కొల్లాపూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

Next Story

Most Viewed