పొలాల్లో పీపీఈ కిట్లు కలకలం

by srinivas |

కరోనా వైరస్ బారినపడ్డ రోగుల చికిత్స నిమిత్తం ఉపయోగించాల్సిన పీపీఈ కిట్లు పొలాల్లో దర్శనమిచ్చాయి. అనంతపురం జిల్లా కల్యాణదుర్గంలోని పొలాల్లో పీపీఈ కిట్ల కలకలం రేగింది. పొలాల్లో రెండు పీపీఈ కిట్ల బాక్సులు కనపడటంతో, అవి రోగులకు చికిత్స చేసిన బాక్సులేమో అని స్థానిక ప్రజల్లో ఆందోళన నెలకొంది. బాక్సులను గమనించిన స్థానికులు ఒక బాక్సును తెరిచి చూశారు. అనంతరం కరోనా భయంతో ఓ బాక్సును కాల్చి పడేశారు. మిగిలిన మరో బాక్సును ఓ యువకుడు పోలీస్ స్టేషన్‌లో అప్పగించాడు. విషయం తెలుసుకున్న వైద్యాధికారులు, పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు.

Advertisement

Next Story