- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
డిగ్రీ కళాశాలపై దాడి.. సర్టిఫికెట్లను కాల్చిన దుండగులు
by Shyam |

X
దిశ, తాండూరు: గత కొన్ని రోజుల క్రితం తాండూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోకి అక్రమంగా ప్రవేశించిన దుండగులు కళాశాల ఆస్తులను, విలువైన సర్టిఫికెట్లను కాల్చివేసిన సంగతి తెలిసిందే. ఇలాంటి దుశ్చర్యకు పాల్పడ్డ ఆగంతుకులను వెంటనే అరెస్టు చేయాలని కళాశాల పూర్వ విద్యార్థులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు మాట్లాడుతూ.. కొన్ని రోజుల క్రితం కళాశాల గేట్లను విరగొట్టి అక్రమంగా చొరబడి కళాశాల ఆస్తులను, విలువైన సర్టిఫికెట్లను కాల్చివేసిన నిందితులను వెంటనే అరెస్టు చేయాలని వారు డిమాండ్ చేశారు. అనంతరం తాండూరు పట్టణ సీఐ రాజేందర్రెడ్డికి ఫిర్యాదు చేసి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు భాను, జిలాని, దత్తాత్రేయ, నరేష్ తదితరులు పాల్గొన్నారు.
Next Story