- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
అమ్మకానికి కరోనా వ్యాక్సిన్.. రూ.80వేలకు బేరం
దిశ, వెబ్ డెస్క్: ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విస్తృతంగా వ్యాప్తిచెందుతోంది. దీని బారిన పడ్డ అనేక దేశాలు ఇప్పటికే అతలాకుతలం అయ్యాయి. ఇప్పట్లో వైరస్ అంతం కాదన్న విషయం తెలియడంతో అందరూ దీనికి వ్యాక్సిన్ కనిపెట్టే పనిలో నిమగ్నం అయ్యారు. కాగా రోజురోజుకూ విస్తరిస్తున్న వైరస్‌ను చూసి జనాలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. వైరస్‌కు మందు ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నారు. అయితే దీనినే అదునుగా భావించిన కొందరు వ్యక్తులు వ్యాపారంగా మార్చుకుని సొమ్ము చేసుకోవాలని భావిస్తున్నారు. తాజాగా.. ప్రకాశం జిల్లా ఒంగోలు జీజీహెచ్ వద్ద కొందరు గుర్తు తెలియని వ్యక్తులు కరోనాకు వ్యాక్సిన్‌కు వచ్చేసిందని గురువారం జోరుగా అమ్మకాలు ప్రారంభించారు. అమయాకులను టార్గెట్‌గా చేసుకుని రూ.80 వేలకు వ్యాక్సిన్‌ను అమ్మడానికి ప్రయత్నించారు. వీళ్లను గమనించిన స్థానికులు, వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలిసిన వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఆ గుర్తు తెలియని వ్యక్తులను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. వారిని ఒంగోలు పోలీస్ స్టేషన్‌కు తరలించి విచారిస్తున్నారు.