- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
టాప్ 10 లో తెలంగాణ.. మరి నిరుద్యోగం?
దిశ, న్యూస్ బ్యూరో : దేశంలో తలసరి ఆదాయంలో ముందువరుసలో ఉన్న తెలంగాణ రాష్ట్రం నిరుద్యోగంలోనూ అంతే ముందుంది. తలసరి ఆదాయంలో దేశ సగటుకన్నా తెలంగాణ రాష్ట్రంలో చాలా ఎక్కువ అని సీఎం కేసీఆర్ ఎన్నోసార్లు నొక్కి చెప్పారు. బడ్జెట్ ప్రసంగంలోనూ ఆర్థిక మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. దీని సంగతి ఎలా ఉన్నా, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత ఉద్యోగాల కల్పనలో విమర్శలు తప్పలేదు. అనేక సంస్థల అధ్యయనాల్లోనూ ఇదే తేలగా, సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకనమీ(సీఎంఐఈ) సంస్థ దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోని నిరుద్యోగ అంశాన్ని అధ్యయనం చేసి విడుదల చేసిన తాజా గణాంకాల్లో అదే వెల్లడైంది.
తెలంగాణ 8వ స్థానంలో…
గడిచిన ఆర్థిక సంవత్సరం (2020-21)లో రాష్ట్ర తలసరి ఆదాయం రూ. 2,28,216గా ఉంది. దేశంలో తెలంగాణ రాష్ట్రానిది 8వ స్థానంగా ఉంది. అయితే జూన్ నెలలో సీఎంఐఈ జరిపిన అధ్యయనం ప్రకారం రాష్ట్రంలోని మొత్తం పని చేయగలిగిన జనాభాలో 33.6 శాతం నిరుద్యోగులతో అన్ని రాష్ట్రాల్లో హర్యానా మొదటి స్థానంలో ఉంటే, 21.3శాతంతో త్రిపుర రెండో స్థానంలో ఉంది. 21 శాతంతో 3వ స్థానంలో జార్ఖండ్, 20.1శాతంతో 4వ స్థానంలో కేరళ, 19.5 శాతంతో 5వ స్థానంలో బీహార్ ఉన్నాయి. ఇలా 15.5 శాతం నిరుద్యోగంతో తెలంగాణ 8వ స్థానంలో ఉంది. పొరుగున్న ఉన్న ఆంధ్రప్రదేశ్ మాత్రం తలసరి ఆదాయంలో తెలంగాణ కన్నా వెనుకబడి ఉన్నా, రెవెన్యూ లోటుతో ఇబ్బంది పడుతున్నా నిరుద్యోగంలో మాత్రం 2.1 శాతమే ఉన్నట్లు తేలింది.
లాక్‌డౌన్‌తో పెరిగిన నిరుద్యోగం..
అన్‌లాక్‌తో సడలింపులు వచ్చినా సర్వీస్ సెక్టార్‌లోని హోటళ్లు, రెస్టారెంట్‌లు, బార్లు లాంటివి పూర్తిస్థాయిలో రెవెన్యూ ఆర్జించలేకపోతున్నాయి. రాత్రిపూట కర్ఫ్యూ కారణంగా రిటెయిల్ దుకాణాలు, షాపింగ్ మాల్‌లకు పెద్దగా వ్యాపారం లేదు. దీంతో యాజమాన్యాలు ఉద్యోగులను తొలగించాయి. హైదరాబాద్ కన్నా పెద్ద నగరమైనా ముంబయిలో పరిస్థితి కాస్త మెరుగ్గా ఉన్నట్లు ఈ అధ్యయనంలో తేలింది. మహారాష్ట్రలో నిరుద్యోగం కేవలం 9.7 శాతం మాత్రమే. పూర్తిస్థాయి లాక్‌డౌన్ తర్వాత ఉపాధి కల్పన విషయంలో తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి ప్రత్యేక ప్రణాళిక రూపొందించడం చేయకపోవడంతో కరోనా లాంటి సంక్షోభాల సమయంలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమైందని ఆర్థికవేత్తలు అభిప్రాయపడుతున్నారు.