- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఫుడ్ లేబుల్స్ లోగుట్టు.. దాని నువ్వు కనిపెట్టు…!
దిశ, ఫీచర్స్ : ‘ఆహారం’ ఎలా ఉన్నా కంటికి ఇంపుగా కనిపిస్తే చాలు లొట్టలేసుకుంటూ తినేస్తాం. ప్రధానంగా ప్రాసెస్డ్ ఫుడ్ విషయంలో చాలా నిర్లక్ష్యం వహిస్తుంటాం. అవి ఎంత ప్రమాదకరమో పదే పదే వైద్యులు హెచ్చరిస్తున్నా ఏం పర్వాలేదనుకుంటాం. అయినా వాటిలో ఉన్న పదార్థాల వివరాలు లేబుల్‌పై ముద్రించడంతో పాటు ప్రమాదకర రసాయనాలుంటే డిస్‌క్లెయిమర్ ప్రింట్ చేస్తారు కదా అంటారా? అయితే ప్యాకేజ్ ముందు భాగంలో ప్రింట్ చేసే స్టేట్‌మెంట్స్, హెల్త్ క్లెయిమ్స్ స్పష్టంగా అనిపించినా, అందులో మనకు అర్థం కానీ లోగొట్టు తప్పక ఉంటుంది. మరి ఆ ‘ఫుడ్ లేబుల్’ను ఎలా డీకోడ్ చేయాలో తెలుసుకుందాం.
19వ శతాబ్దంలో టిన్స్, ప్యాకెట్స్, కంటైనర్లలోని పదార్థాలపై లేబుల్స్ ముద్రించేవాళ్లు కాదు. ఆయా ప్రొడక్ట్స్‌లో ఇంగ్రీడియంట్స్ డిటెయిల్స్, కెమికల్స్ యూసేజ్‌ను తయారీదారులు రహస్యంగానే ఉంచారు. అయితే అమెరికాకు చెందిన జర్నలిస్ట్ డెబోరా బ్లమ్ తన ‘ది పాయిజన్ స్క్వాడ్’ పుస్తకంలో ఆయా ఫుడ్ ప్రాసెసింగ్‌కు సంబంధించిన భయంకరమైన నిజాలను భయటపెట్టింది. పాలలో సుద్ద, ప్లాస్టర్ దుమ్ము లేదా ‘డై’ను వినియోగిస్తే, టిన్డ్ కూరగాయలు పచ్చగా కనిపించేందుకు కాపర్ సల్ఫేట్ చల్లినట్లు అందులో రాసింది. అలాగే మాంసం ఉత్పత్తులకు ఫార్మాల్డిహైడ్ లేదా బోరాక్స్ లాండ్రీ డిటర్జెంట్ జోడించారని తన పుస్తకంలో తెలిపింది. ఇక గ్రీన్ షుగర్ స్వీట్స్ కోసం ఆర్సెనిక్ ఉపయోగించగా, జున్నుకు రంగు రావడానికి సీసం జోడించేవాళ్లు. అయితే ఈ పద్ధతికి వ్యతిరేకంగా లేబులింగ్ విధానాలు తీసుకురావాలని చాలామంది దశాబ్ధాలుగా పోరాడారని అమె వివరించింది. అమెరికాకు చెందిన ఓ శాస్త్రవేత్త ప్యాకేజింగ్ ఫుడ్ ఆరోగ్యానికి హాని కలిగిస్తుందని నిరూపించేందుకు చేసిన ప్రయోగంలో చాలామంది యువకులు అస్వస్థతకు గురయ్యారు. దీంతో యూఎస్ చట్టసభ సభ్యులు లేబుల్ ముద్రించాలనే నిబంధన తీసుకొచ్చారు.
ఇన్‌గ్రీడియంట్స్ లిస్ట్ :
సాధారణంగా చాలా లేబుల్స్ కేలరీలు, కొవ్వు, చక్కెర, ఉప్పు వంటి పదార్థాల జాబితాతో పాటు పోషక విలువల గురించి కొంత సమాచారాన్ని అందిస్తుండగా కొంతకాలం నుంచి హెల్త్ అండ్ వెల్‌బీయింగ్ బెనిఫిట్స్ కూడా ముద్రించడం ప్రారంభించారు. అయితే ప్యాకేజింగ్ జాగ్రత్తగా గమనిస్తే పదార్థాల జాబితాలో నష్టం కలిగించే వాటి గురించి ఫ్రంట్ సైడ్‌లో ముద్రించరు. ఉదాహరణకు ‘సెరల్స్’ ప్యాకింగ్ చూస్తే ఎంతో ఆకర్షణీయంగా, ‘టోటల్ గ్రేన్’ ట్యాగ్‌లైన్‌తో మార్కెట్లోకి తీసుకొస్తారు. కానీ వీటిలో షుగర్ లెవల్స్ అధికం. ప్రతీ వంద గ్రాముల ధాన్యానికి 37 గ్రాముల చక్కెర ఉంటుంది. ఇక కేకులు, స్వీట్లలో ఉపయోగించే కృత్రిమ రంగు E122 వంటివి హైపర్ యాక్టివ్‌గా ఉండే పిల్లలపై ప్రతికూల ప్రభావాలు చూపిస్తాయి. అందుకే ఇలాంటి వివరాలు బ్యాక్‌సైడ్ కోడ్ నేమ్స్‌తో ముద్రిస్తారు.
న్యూట్రిషన్ ఫ్యాక్ట్స్ :
చాలా రకాల ఫుడ్ ప్యాకేజీలపై ‘100% విటమిన్ సి లభ్యత’ ‘తక్కువ సోడియం’, ‘అధిక ఫైబర్’, ‘లో ఫ్యాట్’ వంటి చాలా పదాలను ఎఫ్‌డీఏ నియంత్రిస్తుంది. ఒకవేళ ఆయా సంస్థలు ఇలాంటి స్టేట్‌మెంట్స్ ఇవ్వాలంటే నిర్దిష్ట మార్గదర్శకాలకు అనుగుణంగా ఉండాలి. ఉదాహరణకు బంగాళాదుంప చిప్స్ బ్యాగ్‌లో కొవ్వు శాతం తక్కువని, ‘ఆరోగ్యకరమైన’ ఆహారం అని లేబుల్‌పై సూచిస్తారు. కానీ అల్ట్రా- ప్రాసెస్ చేసిన ఆహారం తక్కువ న్యూట్రిషన్‌ను అందిస్తుందని నిపుణులు హెచ్చరిస్తూనే ఉన్నారు.
సర్వింగ్ సైజ్ :
ఎంతోమంది కేలరీ విషయంలో చాలా జాగ్రత్త వహిస్తారు. అయితే ఫుడ్ ప్యాకేజింగ్‌పై ఒకరికి వడ్డించే కేలరీల మొత్తాన్ని మాత్రమే ముద్రిస్తారు. వడ్డించే పరిమాణాన్ని అంతగా పట్టించుకోరు. ఉదాహరణకు.. ఓ ట్రైల్ మిక్స్ ప్యాకెట్‌పై ‘ఫర్ వన్ సర్వింగ్ 100 కేలరీ’లు అని ఉంటుంది. వాస్తవానికి ఆ ప్యాకెట్ మూడు సర్వింగ్స్ కలిగి ఉంటుంది. తద్వారా మొత్తం ఒకరే తింటే 300 కేలరీలు తీసుకున్నట్లే లెక్క.
ఇండియాలో
ప్యాకేజీ చేసిన ఆహార ఉత్పత్తులపై న్యూట్రిషన్, ఇంగ్రీడియంట్స్ లేబుల్స్ మనలో చాలామంది చదవరు. అర్థం చేసుకునే విధానమూ తెలియదు. దీంతో FMCG కంపెనీల మార్కెటింగ్ జిమ్మిక్కులు తెలుసుకోలేరు. మిస్ బ్రాండింగ్, బోగస్ హెల్త్ క్లెయిమ్‌లతో కంపెనీలు వినియోగదారులను ఆకర్షిస్తూ మోసం చేస్తున్నాయి. ముఖ్యంగా హెల్త్ డ్రింక్స్ విషయంలో ఇది ఎక్కువగా జరుగుతోంది.
హెల్తీ డ్రింక్స్ :
ప్రతీ తల్లిదండ్రులు తమ పిల్లలకు మంచి ఆరోగ్యాన్ని అందించడానికి ప్రయత్నిస్తారు. సరైన హైట్-వెయిట్, మెమరీ పవర్ పెరిగేందుకు హెల్తీ డ్రింక్స్ తాగించాలనే ఆలోచనలో ఉంటారు. ఇందులో ‘కాంప్లాన్’ ఒకటి. కానీ పిల్లల పెరుగుదల, జ్ఞాపకశక్తి వృద్ధి రేటును రెట్టింపు చేస్తాయనే హెల్తీ డిస్‌క్లెయిమర్‌పై ఈ కంపెనీ కోర్టుకేసులు ఎదుర్కొంది. ఇక ఎక్కువ శక్తిని అందిస్తుందని చెప్పుకునే హార్లిక్స్, బూస్ట్‌ల విషయంలోనూ ఇదే జరిగింది. పిల్లల శారీరక పెరుగుదలకు హార్లిక్స్ ‘వైద్యపరంగా నిరూపించబడింది’ అన్న వాదనను నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ (ఎన్ఐఎన్) ఖండించింది. ఆయా డ్రింక్స్ తయారీ కంపెనీలు తమ ప్రకటనలను సమర్థించుకోవడంలో విఫలమవుతున్నాయి. చక్కెర అధిక మోతాదులో వినియోగించడం, మాల్ట్ కలిగి ఉండటం అనేది ప్రపంచ ఆరోగ్య సంస్థ సూత్రానికి లోబడి లేనట్లే. ఎందుకంటే ఒక వ్యక్తికి రోజుకు ఆరు టీస్పూన్ల చక్కెర మాత్రమే అవసరమని WHO పేర్కొంది.
నో షుగర్ నో మైదా:
అత్యంత మోసపూరితమైన క్లెయిమ్ ఇది. డైజెస్టివ్ బిస్కెట్స్, చ్యవన్‌ప్రాష్‌తో పాటు మార్కెట్‌లో లభిస్తున్న రకరకాల బిస్కెట్స్ ఈ తరహా క్లెయిమ్స్ చేసిన జాబితాలో ఉన్నాయి. కానీ వీటి లేబుల్స్ క్షుణ్ణంగా పరిశీలిస్తే తేనె లేదా అధిక ఫ్రక్టోజ్, కార్న్ సిరప్, మాల్ట్, డెక్స్‌ట్రిన్, మాల్టిటోల్, సార్బిటాల్ లాంటి చక్కెర ఆల్కహాల్స్ కూడా కలిగి ఉన్నాయి.
లైట్ ఫుడ్ : ‘లైట్’ అనే పదం అసలుతో పోలిస్తే 50 శాతం తక్కువ కొవ్వు ఉన్న ఆహారాన్ని సూచిస్తుంది. అయితే పేరున్న బ్రాండ్స్ లైట్ ఫుడ్ అని ప్రకటనలు ఇవ్వడంతో పాటు హృదయానికి మంచిది, పొట్ట పెరగదు, ఎంత తిన్నా లైట్‌గానే ఉంటారనే ప్రచారాలు చేసుకుంటున్నాయి. వంట నూనెల నుంచి ఈ తరహా ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయనే శాస్త్రీయ ఆధారాలు ఎక్కడా లేవు.