- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కరోనా ఫైన్స్ రూ. 3 కోట్లు…?
దిశ, వరంగల్: కరోనా పుణ్యమా అని వాహనదారులకు జరిమానాల మోత మోగుతోన్నది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ మహమ్మారి కట్టడికి ప్రజలంతా స్వీయ నియంత్రణ పాటించాలని, అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని లాక్ డౌన్ ను విధించాయి. నిబంధనలు ఉల్లంఘించిన వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని పోలీస్ శాఖకు స్పష్టమైన ఆదేశాలిచ్చాయి. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఇప్పటి వరకు నిబంధనలు ఉల్లంఘించి రోడ్లపైకి వచ్చిన 13,917 వాహనాలను అధికారులు సీజ్ చేశారు. మరికొన్ని స్టేషన్ల పరిధిలో నిబంధనలు అతిక్రమించిన వాహనాలకు ఈ-చలానాలు విధించారు. ఈ నేపథ్యంలో వాహనాల జరిమానాల కింద రూ. 3 కోట్లకు పైగా వసూలైనట్లు అధికారికంగా తెలుస్తోన్నది. ఇదిలా ఉండగా పోలీసులు సీజ్ చేసిన వాహనాలను కోర్టు ద్వారా పొందేందుకు అధికారికంగా అనుమతి ఇచ్చారు.
ఫైన్లే ఫైన్లు..?
కరోనా వైరస్ ప్రపంచ దేశాలను వణికిస్తోన్నది. ఇప్పటి వరకు మందు కనిపెట్టని వైరస్ కట్టడికి స్వీయ నియంత్రణే సరియైన మందని కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ విధించింది. లాక్ డౌన్ సమయంలో కేవలం నిత్యావసర వస్తువులు, అత్యవసర సేవలకు మాత్రమే బయటకు వచ్చేందకు అనుమతి ఉంది. కరోనా మహమ్మారి ఉమ్మడి వరంగల్ జిల్లాను కూడా వదిలిపెట్టలేదు. ఆరంభంలో అర్బన్ జిల్లాలో 25 కు పైగా కేసులు నమోదయ్యాయి. దీంతో పోలీస్ శాఖ అర్భన్ జిల్లాలో కఠిన చర్యలకు ఉపక్రమించింది. అనవసరంగా రోడ్లపైకి వచ్చిన వాహనాలను సీజ్ చేసిన పోలీసులు జరిమానాలు విధించారు. వరంగల్ కమిషనరేట్ పరిధిలో ఇప్పటి వరకు 13917 వాహనాలు సీజ్ అయ్యాయి. ఇందులో ద్విచక్ర వాహనాలు 13040, ఆటోలు 554, కార్లు 281, ట్రాక్టర్లు 42 ఉన్నాయి. అంతేగాకుండా 24,492 ఈ పెట్టీ కేసులు, 575 ఎఫ్ఐఆర్ లు నమోదు చేసినట్లు పోలీస్ అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో నిబంధనలు ఉల్లంఘించిన వాహనదారులకు రూ. 3 కోట్లకు పైగా జరిమానాలు విధించినట్లు పోలీస్ రికార్డులు చెబుతున్నాయి.
వాహనాల రిలీజ్..
లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘనలో భాగంగా సీజ్ అయిన వాహనాల రిలీజ్ ప్రక్రియ మొదలైంది. ఈ మేరకు పోలీస్ కమిషనర్ రవీందర్ శనివారం పలు వాహనాల పత్రాలు పరిశీలించారు. అన్ని పత్రాలు సరిగా ఉన్నాయని నిర్థారించుకున్న అనంతరం వాహనాలు రిలీజ్ చేశారు. మరికొన్ని వాహనాలు కోర్టు ద్వారా పొందేందుకు సంబంధిత డాక్యుమెంటేషన్ ప్రక్రియను పూర్తి చేస్తున్నారు పోలీస్ అధికారులు. లాక్ డౌన్ అనంతరం వాహనదారులు సరియైన పత్రాలు కోర్టులో సమర్పించి వెహికిల్స్ పొందాల్సి ఉంటుంది. ఇప్పటికే పలుమార్లు జరిమానాలు చెల్లించిన వాహనదారులు కోర్టును ఆశ్రయించాల్సి రావడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కోర్టులో న్యాయమూర్తి ఏ మేరకు జరిమానాలు విధిస్తారోనని బెంబెలెత్తుతున్నారు.