భారీగా పెరిగిన స్పైస్‌జెట్ నష్టాలు..

by Harish |
భారీగా పెరిగిన స్పైస్‌జెట్ నష్టాలు..
X

దిశ, వెబ్‌డెస్క్ : దేశీయ బడ్జెట్ క్యారియర్ విమానయాన సంస్థ స్పైస్‌జెట్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూన్ త్రైమాసికంలో రూ. 729 కోట్ల నికర నష్టాలను వెల్లడించింది. అంతకుముందు మార్చి త్రైమాసికంలో సైతం సంస్థ రూ. 235 కోట్లు, గతేడాది జూన్ త్రైమాసికంలో రూ. 593 కోట్ల నష్టాలను నమోదు చేసింది. కొవిడ్ ప్రభావం కారణంగా కార్యకలాపాలు గణనీయంగా దెబ్బతిన్నదని కంపెనీ తెలిపింది. ప్రయాణ గిరాకీ దారుణంగా పడిపోయిన కారణంగానే నష్టాలు అధికంగా ఉన్నాయని కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది.

ఇక సమీక్షించిన నెలలో స్పైస్‌జెట్ కార్యకలాపాల ఆదాయం గతేడాది రూ. 514 కోట్ల నుంచి 112 శాతం పెరిగి రూ. 1,089 కోట్లకు చేరుకుంది. ‘గడిచిన ఐదు త్రైమాసికాలు స్పైస్‌జెట్ అత్యంత క్లిష్టమైన సవాళ్లను ఎదుర్కొంది. గతేడాది కొవిడ్ నుంచి కోలుకునే ప్రయత్నంలో ఉండగానే ఈ ఏడాది సెకెండ్ వేవ్ వల్ల విమానయాన రంగంలోనే అత్యంత దారుణంగా సంస్థ ప్రభావితమైంది. కొవిడ్ టీకా పెరగడం, విమాండ్ ప్రయాణానికి డిమాండ్ క్రమంగా పెరుగుతున్న తరుణంలో రానున్న రోజుల్లో మెరుగైన ఫలితాలను ఆశిస్తున్నాము. మరికొన్ని త్రైమాసికాల్లో పరిస్థితులు చక్కబడతాయని భావిస్తున్నామని’ స్పైస్‌జెట్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ అజయ్ సింగ్ అన్నారు.


Advertisement

Next Story