- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కట్టడి చేస్తరా.. కోల్పోతరా..?
అండర్-19 వరల్డ్‌కప్‌లో భాగంగా ఈరోజు బంగ్లాదేశ్‌తో జరుగుతున్న ఫైనల్ మ్యాచ్‌లో భారత యువ జట్టు 177 పరుగులకే ఆలౌటైంది. డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగిన భారత జట్టు వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయి సాధారణ స్కోరుకే పరిమితమైంది. భారత ఆటగాళ్లలో యశస్వి జైస్వాల్(88 పరుగులు) రాణించగా, తిలక్ వర్మ(38 పరుగులు) ఫర్వాలేదనిపించాడు. అటు తర్వాత ధ్రువ్ జురేల్(22 పరుగులు) మోస్తరుగా ఆడగా, మిగతా వారు పెవీలియన్ బాట పట్టారు. ఈ ముగ్గురు మినహా మిగతా వారు సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. టాస్ గెలిచిన బంగ్లాదేశ్ ఫీల్డింగ్ ఎంచుకోవడంతో భారత్ ముందుగా బ్యాటింగ్‌కు దిగింది. భారత్ ఇన్నింగ్స్‌ను జైస్వాల్, సక్సేనాలు ఆరంభించారు. అయితే 17 బంతులు ఆడిన సక్సేనా రెండు పరుగులే చేసి పెవిలియన్ చేరాడు. ఆపై తిలక్ వర్మతో కలిసి జైస్వాల్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. వీరిద్దరూ రెండో వికెట్‌కు 94 పరుగులు జత చేసి ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లారు. కాగా, తిలక్ వర్మ రెండో వికెట్‌గా ఔటైన తర్వాత జైస్వాల్‌కు సరైన సహకారం లభించలేదు. కెప్టెన్ ప్రియాంగార్గ్(7) ఇలా వచ్చి అలా వెళ్లిపోయాడు. ఇక జైస్వాల్ నాల్గో వికెట్‌గా ఔటైన తర్వాత ఏ ఒక్కరూ పెద్దగా ప్రభావం చూపలేదు. జోరెల్ ఆడుతున్నాడనుకునే సమయంలో అనవసర పరుగు కోసం యత్నించి రనౌట్ రూపంలో వెనుదిరిగాడు. జోరెల్ ఔటైన తర్వాత భారత్ ఆటగాళ్లు క్రీజ్‌లోకి వచ్చామన్న పేరుకే వచ్చి పెవిలియన్ బాటపట్టారు. దాంతో భారత్ జట్టు 47.2 ఓవర్లలోనే ఆలౌటైంది. 21 పరగుల వ్యవధిలో భారత్ ఆరు వికెట్లను కోల్పోయింది. బంగ్లాదేశ్ బౌలర్లలో అవిషేక్ దాస్ మూడు వికెట్లు సాధించగా,షోరిఫుల్ ఇస్లామ్, హసన్ షకిబ్‌లు తలో రెండు వికెట్లు తీశారు. రకిబుల్ హసన్‌కు వికెట్ దక్కింది. ఇద్దరు రనౌట్ రూపంలో వెనుదిరగడంతో భారత్ రెండొందల మార్కును కూడా చేరలేకపోయింది. మరి 178 పరుగుల టార్గెట్‌ను కాపాడుకుంటూ బంగ్లా బ్యాట్‌మెన్‌లను కట్టడి చేస్తరా…? కప్ కోల్పోతరా…? అనే టెన్షన్ ప్రతి ఒక్క అభిమానిలో ఉంది. ఏదో అద్భుతం జరిగితే తప్ప భారత్ టైటిల్‌ను నిలబెట్టుకోవడం అంత ఈజీ కాదు.