- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అ ఆసుపత్రికి అనుమతులు నై.. వైద్యానికి సై.. చివరికి..!
X
దిశ, షాద్ నగర్: వైద్యఆరోగ్యశాఖ అనుమతులు లేకుండా, క్వాలిఫైడ్ డాక్టర్ లేకుండా బినామీ వైద్యుల పేర్లతో వైద్యం అందిస్తున్న వైద్యశాలపై అధికారులు కొరడా ఝుళిపించారు. రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ పట్టణంలోని పాత హైవే రోడ్డులో అనుమతులు లేకుండా కొనసాగుతున్న అమ్మ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను మంగళవారం జిల్లా వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ అధికారులు సీజ్ చేశారు. ఇటీవల పట్టణంలో అమ్మ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ పేరుతో క్వాలిఫైడ్ డాక్టర్ లేకుండా క్వాలిఫైడ్ బినామీ పేర్లతో ఆసుపత్రిని నిర్వహించినట్టు పలు ఆరోపణలు వచ్చాయి. ఈ మేరకు అధికారులకు సమాచారం అందడంతో జిల్లా మాస్ మీడియా అధికారి పి.నరహరి, డిప్యూటీ మాస్ మీడియా అధికారి శ్రీనివాస్, షాద్ నగర్ డిప్యూటీ డీఎం అండ్ హెచ్ఓ డాక్టర్ దామోదర్ ఇతర సిబ్బంది ఆసుపత్రిని సందర్శించి సీజ్ చేశారు.
Advertisement
Next Story