- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వేధింపులు తాళలేక తల్లీకూతురు ఆత్మహత్య
దిశ, నిజామాబాద్ రూరల్: భర్త వేధింపులు తాళలేక కూతురితో పాటు భార్య ఆత్మహత్య చేసుకున్న ఘటన నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం కంజర్ గ్రామంలో చోటుచేసుకుంది. ఎస్సై పూర్ణేశ్వర్ తెలిపిన వివరాల ప్రకారం.. జెనీగెలా రమేశ్ నాలుగైదేండ్లుగా తన భార్య అనురాధను వేధింపులకు గురిచేస్తున్నాడు. ఈ క్రమంలో వేధింపులకు తాళలేక అనురాధ తన కూతుర్లతో కలిసి ఆత్మహత్య చేసుకోవాలని అనుకొంది. ఈ మేరకు శుక్రవారం ఉదయం కంజర్ కులాస్పూర్ గ్రామాల మధ్య ఉన్న పెద్ద చెరువులో దూకడానికి కూతుర్లు అక్షయ, నవ్యశ్రీ, వైష్ణవిలతో కలిసి వెళ్లింది.
ముందుగా చిన్న కూతురు నవ్య శ్రీ (08) చెరువులో తోసేసింది. ఆ తర్వాత అనురాధ (38) చెరువులో దూకింది. దీంతో మిగతా ఇద్దరు కూతుళ్లు భయపడి ఇంటికి తిరిగి వచ్చేశారు. విషయాన్ని తెలుసుకున్న గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. కాగా ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు గజ ఈతగాళ్లతో పెద్ద చెరువులో శవాలను వెలికి తీయించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.