102కు యూకే వేరియంట్ కేసులు

by Shamantha N |
102కు యూకే వేరియంట్ కేసులు
X

న్యూఢిల్లీ: దేశంలో యూకే వేరియంట్ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నది. ఇప్పటివరకు 102 మందికి యూకే వేరియంట్ వైరస్ సోకిందని బుధవారం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది. ఈ నెల 11 వరకు కొత్త వేరియంట్ కేసుల సంఖ్య 96గా ఉన్నాయి. తాజాగా ఆరు కేసులు నమోదైనట్లు పేర్కొంది. దేశంలో ఇప్పటివరకు 1.49కోట్ల కరోనా వైరస్ కేసులు నమోదు కాగా, ప్రస్తుతం 2.14 లక్షల యాక్టివ్ కేసులు ఉన్నాయి. బుధవారం కొత్తగా 15,698 కొత్త కేసులు, 202 మరణాలు చోటుచేసుకున్నాయి. అత్యధికంగా కేరళలో 5,507, మహారాష్ట్రలో 2,936 కేసులు వెలుగు చూశాయి.

Advertisement

Next Story