- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఫిక్కీ ప్రెసిడెంట్‌గా ఉదయ్ శంకర్ బాధ్యతలు స్వీకరణ
దిశ, వెబ్‌డెస్క్: 2020-21 ఆర్థిక సంవత్సరానికి పరిశ్రమల సమాఖ్య ఫిక్కీ అధ్యక్షుడిగా ఉదయ్ శంకర్ బాధ్యతలు స్వీకరించినట్టు పరిశ్రమ సంఘం సోమవారం వెల్లడించింది. మీడియా, ఎంటర్‌టైన్‌మెంట్ విభాగానికి చెందిన వ్యక్తి ప్రెసిడెంట్ కావటం ఫిక్కీ చరిత్రలో ఇదే మొదటిసారి. ప్రస్తుతం ఈ పదవిలో ఉన్న అపోలో హాస్పిటల్స్ గ్రూప్ జాయింట్ ఎండీ సంగీతా రెడ్డి నుంచి ఆయన బాధ్యతలను అందుకున్నారు.
అలాగే, హిందూస్తాన్ యూనిలీవర్ లిమిటెడ్ ఛైర్మన్‌గా ఉన్న సంజీవ్ మెహతా ఫిక్కీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు తీసుకున్నారు. ఇండియన్ మెటల్స్ అండ్ ఫెరో అలాయ్స్ లిమిటెడ్ ఎండీ సుబ్రకాంత్ ఫిక్కీ వైస్ ప్రెసిడెంట్‌గా చేరారని పరిశ్రమ సంఘం పేర్కొంది. సంగీతా రెడ్డి ఫిక్కీ ప్రెసిడెంట్‌గా విశేష కృషిని అందించారని, ప్రస్తుత క్లిష్ట పరిస్థితులను అధిగమించి సాధారణ స్థితికి చేర్చేందుకు ప్రయత్నిస్తామని ఉదయ్ శంకర్ చెప్పారు. దేశ జీడీపీ వృద్ధిలో ఫిక్కీ ప్రధాన పాత్ర పోషిస్తుందని ఆయన వెల్లడించారు.