ప్రాణాలు తీస్తున్న బెట్టింగ్

by Anukaran |
ప్రాణాలు తీస్తున్న బెట్టింగ్
X

దిశ, వెబ్‎డెస్క్: క్రికెట్‌ బెట్టింగ్‌ తో ఇద్దరు వ్యక్తులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. అందులో ఓ వ్యక్తి ప్రాణం కోల్పోగా.. మరో వ్యక్తి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన గుంటూరు జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. బెల్లంకొండకు చెందిన సురేష్, కొమురయ్య అనే ఇద్దరు యువకులు రూ.లక్ష పోగొట్టుకున్నారు. మనస్తాపంతో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. వీరిలో చికిత్స పొందుతూ సురేష్‌ మృతి చెందాడు. కొమురయ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

కాగా, ఆత్మహత్యయత్నానికి ముందు వీరిద్దరు సెల్ఫీ వీడియో తీసుకున్నారు. బెట్టింగ్‌ నిర్వాహకుడికి రూ. 30వేలు చెల్లించారు. మరో రూ.80 వేల ఇవ్వాల్సిందేనని నిర్వాహకుడు పట్టుబట్టాడు. దీంతో ఆ డబ్బులు కట్టలేక ఆత్మహత్య చేసుకుంటున్నట్లు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed