- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జైలు నుంచి ఇలా వచ్చి.. అలా ఛీటింగ్ చేశారు
దిశ, ఏపీ బ్యూరో: నేరం చేసి జైలు కెళ్లిన ఇద్దరు వ్యక్తులు విడుదలైన అరగంటకే మళ్లీ ఛీటింగ్‌కి పాల్పడిన ఘటన తూర్పుగోదావరి జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు వెల్లడించిన ఘటన వివరాల్లోకి వెళ్తే… ప్రభుత్వ పథకాలకు రుణాలు ఇప్పిస్తామంటూ తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురంకి చెందిన తోట బాలాజీ నాయుడు (42), రావులపాలెం మండలం ఊబలంకకు చెందిన మల్లిడి తాతారెడ్డి (33)లు క్రైమ్ పార్టనర్స్.. వీరిద్దరూ గతంలో ప్రముఖులను మోసం చేసిన కేసులో జైలుకెళ్లారు. శిక్ష ముగియడంతో శనివారం సాయంత్రం వైజాగ్ సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యారు.
జైలు నుంచి విడుదలైన కాసేపటికే అనంతపురం జిల్లాకు చెందిన ఓ ఎంపీకి, ఎమ్మెల్సీకి ఫోన్ చేసి, తాను ఇండస్ట్రీస్ డిప్యూటీ సెక్రటరీనని చెబుతూ, రూ. 50 లక్షల రుణం ఇప్పిస్తానని నమ్మబలికాడు. అయితే అంత మొత్తం రావాలంటే మార్జిన్ మనీగా తొలుత 1.25 లక్షల రూపాయలు ఖాతాలో జమ చేయాలని సూచించాడు. అతని మాటలు నిజమేనని నమ్మిన ఎమ్మెల్సీ విషయం తన అనుచరులకు చెప్పారు. దీంతో హిందూపురం, చిలమత్తూరుకు చెందిన ఏడుగురు ఆ వ్యక్తి చెప్పిన ఖాతాలకు మొత్తం 8.25 లక్షల రూపాయలు ట్రాన్స్‌ఫర్ చేశారు.
డబ్బులు ట్రాన్స్‌ఫర్ అయిన తరువాత లోన్‌కి సంబంధించిన ఎలాంటి సమాచారం లేకపోవడంతో ఎమ్మెల్సీ ఆరా తీశారు. అలాంటి లోన్లేవీ లేవని, ఆయన చెప్పిన పేరుతో ఇండస్ట్రీస్ డిప్యూటీ సెక్రటరీ కూడా లేరని తేలడంతో మోసం విషయం అర్ధమైంది. దీంతో విషయాన్ని ఆయన పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. వచ్చిన ఫోన్ నంబరు, డబ్బులు బదిలీ చేసిన ఖాతాల గురించి ఆరా తీయగా డబ్బులు జమ అయిన ఖాతా తాతారెడ్డిదని, ఎమ్మెల్సీకి ఫోన్ చేసింది అతడి మిత్రుడు బాలాజీ నాయుడని గుర్తించారు. దీంతో వెంటనే ఆ ఖాతాను సీజ్ చేసిన పోలీసులు అందులో 7.52 లక్షల రూపాయలు మాత్రమే ఉన్నట్టు గుర్తించారు. దీంతో వారిపై మరోసారి కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు ప్రారంభించారు.