దూసుకెళ్లిన లారీ.. ఇద్దరు దుర్మరణం

by Sridhar Babu |   ( Updated:2021-11-14 00:07:45.0  )
దూసుకెళ్లిన లారీ.. ఇద్దరు దుర్మరణం
X

దిశ, మంథని: ఇసుక క్వారీకి వెళుతున్న ఇసుక లారీ అదుపు తప్పి పొలాల్లోకి దూసుకపోవడంతో ఇద్దరు మృత్యువాత పడ్డారు. ఈ ఘటన పెద్దపల్లి జిల్లా మంథని మండలం బిట్టుపల్లి వద్ద ఆదివారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్లితే.. లారీ అదుపుతప్పి వరి కోత పనులు పరిశీలిస్తున్న ఇద్దరు వ్యక్తులపై దూసుకెళ్లిన లారీ పొలంలో కూరుకుపోయింది. ఈ ఘటనలో బిట్టుపల్లి గ్రామానికి చెందిన చిలువేరు గట్టయ్య (60 ) అక్కడికక్కడే మరణించగా, దర్గుల రాజమల్లు (60) ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతిచెందాడు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదుచేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed