షాకింగ్‌ న్యూస్.. ఇండియాలో అడుగుపెట్టిన ఒమిక్రాన్‌

by Anukaran |   ( Updated:2021-12-02 06:35:38.0  )
corona
X

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ భారత్‌లో అడుగుపెట్టింది. ఇండియాలో రెండు ఒమిక్రాన్ వేరియంట్ కేసులు నమోదు అయినట్టు కేంద్ర ప్రభుత్వం బాంబు పేల్చింది. కర్నాటకలో రెండు కేసులు వెలుగుచూసినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ గురువారం తెలిపింది. ఈ నేపథ్యంలో బాధితుల ప్రైమరీ కాంటాక్ట్‌ల వివరాలను సేకరిస్తున్నామని కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ తెలిపారు. ఈ రెండు కేసులు కూడా విదేశాల నుంచి వచ్చిన వారికే సోకినట్టు తేలిందన్నారు. ఆ ఇద్దరిలో ఒకరి వయసు 66ఏళ్లు కాగా మరొకరి వయసు 46 ఏళ్లు.

ఈ క్రమంలో బెంగళూరుకి వచ్చిన ప్రయాణికుల్లో బయటపడిన ఒమిక్రాన్ కేసుల్లో కనిపించిన లక్షణాలను సైతం కేంద్రం వెల్లడించింది. ఇద్దరిలోనూ తీవ్రమైన లక్షణాలేమీ కనిపించలేదని, ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని లవ్ అగర్వాల్ స్పష్టం చేశారు. అయితే, వీరి ప్రైమరీ, సెకండరీ కాంటాక్టులను గుర్తించినట్లు పేర్కొన్న కేంద్రం.. వారికి పరీక్షలు నిర్వహిస్తున్నట్టు చెప్పింది. అంతేకాకుండా, విదేశాల నుంచి వచ్చే వారికి తప్పనిసరిగా ఆర్టీపీసీఆర్ టెస్టు తప్పనిసరి చేశామని, టెస్టులో నెగిటివ్ వచ్చినా వారం రోజులు క్వారంటైన్‌లో ఉండాలని నిబంధనలు తీసుకొచ్చింది.

Advertisement

Next Story