తెలంగాణలో పెళ్లిచేసుకొని ఒక్కటవబోతున్న పురుషులు.. ఎక్కడో తెలుసా.?

by Anukaran |   ( Updated:2021-10-31 03:25:13.0  )
తెలంగాణలో పెళ్లిచేసుకొని ఒక్కటవబోతున్న పురుషులు.. ఎక్కడో తెలుసా.?
X

దిశ, డైనమిక్ బ్యూరో : పెళ్లంటే అదో ఉత్సవం… అటేడు తరాలు.. ఇటేడు తరాలు చూసి కుటుంబసభ్యులు వివాహం జరుపుతారు. పెళ్లి అనగానే ఎలా జరుగుతుందోనని కన్యాదాతకు తెలియని భయం ఎప్పుడూ వెంటాడుతూనే ఉంటుంది. పెళ్లి చూపుల నుంచి మొదలు.. పెళ్లి నిశ్చయమై.. కన్యాదానం చేసి అప్పగింతలు పూర్తవుతే ఓ యుద్ధాన్ని గెలిచినట్లేనని ఫీల్ అవుతుంటారు. కానీ, అలాకాకుండా, కన్యకి బదులు ఇద్దరు అబ్బాయిలే పెళ్లిచేసుకుంటే.. అది తెలంగాణలో ఇలాంటి వివాహం జరిగితే.. ఊహించడానికే విచిత్రంగా ఉంది కదా, కానీ ఇప్పుడు ఈ విచిత్ర పెళ్లి గురించి తెలుసుకోండి.

హైదరాబాద్‌కి చెందిన సుప్రియో, అభయ్ అనే ఇద్దరు స్వలింగ సంపర్కులు (గే) 2013లో డేటింగ్ యాప్ ద్వారా కలిశారు. చాటింగ్ చేస్తూ ఒకరి గురించి ఒకరు తెలుసుకొని దగ్గరయ్యారు. దాదాపు ఎనిమిదేళ్ల నుంచి కలిసి ఉంటున్నారు. ఇలా ఒకరినొకరు అర్థం చేసుకొని వివాహం చేసుకునేందుకు సిద్ధమయ్యారు. అయితే, ఇలా ఇద్దరు పురుషులు పెళ్లి చేసుకోవడం తెలంగాణలో ఇదే తొలిసారి కాబోతోంది. అయితే, పెళ్లి గురించి తల్లిదండ్రులను ఒప్పించేందుకు ఎంతో కష్టపడ్డామని దేవుని దయతో చివరి ఒప్పుకున్నట్లు సుప్రియో, అభయ్‌లు మీడియాతో చెప్పుకొచ్చారు. అయితే, సుప్రియో బెంగాలీ అభయ్ పంజాబీ కావడంతో సాధారణ వివాహ వేడుకల మాదిరిగా హల్దీ వేడుక‌తో పాటు రింగులు మార్చుకోవడం ఉంటుందని వారు తెలిపారు.

Advertisement

Next Story