- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
వేర్వేరు ప్రదేశాల్లో నెత్తురోడిన రహదారులు.. ఒకేలా ప్రమాదం.. ఇద్దరు మృతి
దిశ, పర్వతగిరి/గూడురు : వరంగల్ రూరల్ జిల్లా పర్వతగిరి మండలం అన్నారం గ్రామంలో కొలువుతీరిన హజ్రత్ సయ్యద్ యాకూబ్ షావళి బాబా దర్శనం చేసుకుని తిరిగి బైక్ మీద వెళుతున్న క్రమంలో గుర్తుతెలియని వాహనం ఢీకొని ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన అన్నారం షరీఫ్ శివారు పెద్ద తండా స్కూల్ దగ్గర శుక్రవారం చోటు చేసుకుంది. మృతుడు సంగెం మండలం కొత్తగూడ గ్రామానికి చెందిన ఎన్నపోతుల చంద్రమౌళి (60)గా గుర్తించారు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వెంటనే ఘటనా స్థలికి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం వరంగల్ ఎంజీఎంకు తరలించారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి్ ఉంది.
గుర్తు తెలియని వాహనం ఢీకొని..
గూడురులోని ముసలమ్మ బడువా ప్రధాన రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వివరాల్లోకివెళితే.. గూడూరు శివారులోని గొల్లగూడెంనకు చెందిన కుండె అనిల్, కలమ్మలు ద్విచక్ర వాహనంపై నర్సంపేటలో జరిగిన ఫంక్షన్‌కు వెళ్లి తిరిగి వస్తున్న క్రమంలో వెనుక నుంచి వచ్చిన గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కుండె కళమ్మ (55) అక్కడికక్కడే మృతి చెందింది. బైకు నడిపిన అనిల్‌కు తీవ్రగాయాలయ్యాయి. అతన్ని వెంటనే గూడూరులోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.