IPL: 14 ఏళ్ల సూర్యవంశీ ఒక్క మ్యాచుతో సృష్టించిన రికార్డులు ఇవే..?

by Mahesh |
IPL: 14 ఏళ్ల సూర్యవంశీ ఒక్క మ్యాచుతో సృష్టించిన రికార్డులు ఇవే..?
X

దిశ, వెబ్ డెస్క్: ఐపీఎల్ చరిత్రలో యువ ప్లేయర్లకు స్వర్గధామంగా రాజస్థాన్ రాయల్స్ (Rajasthan Royals) మంచి పేరును సంపాదించుకుంది.ఈ క్రమంలోనే మెగా వేలంలో 14 ఏళ్ల యువకుడిని కోటి 10 లక్షలకు కొని అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. అయితే తుది జట్టులో ఆ యువ ప్లేయర్ కు అవకాశాలు సరిగ్గా రాలేదు. ఇటీవల జట్టు కెప్టెన్ సంజూ శాంసన్ గాయం కారణంగా మ్యాచులకు దూరం కావడంతో అతని స్థానంలో వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi)కి చోటు దక్కింది.

దీంతో మొదటి మ్యాచ్‌లో మొదటి బంతికే సిక్సర్ (Six on the first ball) కొట్టి అందరిని ఆశ్చర్యానికి గురి చేశాడు. తాజాగా సోమవారం రాత్రి గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans) జట్టుతో జరిగిన మ్యాచ్‌లో ఈ 14 ఏళ్ల కూర్రాడు ఆకాశమే హద్దుగా రెచ్చిపోయాడు. ప్రతి బంతిని బౌండరీకు తరలిస్తూ.. గుజరాత్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఈ మ్యాచులో వైభవ్ సూర్యవంశీ 38 బంతుల్లో 7 ఫోర్లు, 11 సిక్సర్లతో 101 పరుగులు చేశాడు. దీంతో అతను ఐపీఎల్ మొదటి సీజన్ లోనే సెంచరీ నమోదు (Century entry) చేశాడు. అలాగే అత్యంత వేగంగా సెంచరీ నమోదు చేసిన భారతీయుడిగా చరిత్రలో నిలిచాడు.

14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ సృష్టించిన రికార్డులు..

1. ఐపీఎల్‌లో చరిత్రలో అతి పిన్న వయస్సులో ఆరంగేట్రం చేసిన ప్లేయర్‌గా రికార్డు.

2. ఐపీఎల్ ఆరంగేట్రంలో, వైభవ్ తన మొదటి బంతికె సిక్సర్.

3.అతి పిన్న వయస్సులో ఐపీఎల్‌లో హాఫ్ సెంచరీ.

4. ఐపీఎల్ చరిత్రలో 35 బంతులకే సెంచరీ చేసిన భారతీయ ఆటగాడిగా పేరు నమోదు.

5. ఐపీఎల్‌లో చరిత్రలో ఒకే ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన భారత యువ ప్లేయర్‌గా రికార్డు.

6. ఏదేని.. టీ20లో సెంచరీలో అత్యధిక బౌండరీల శాతం.

7. ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్ అత్యధిక ఓపెనింగ్ భాగస్వామ్యం.



Next Story

Most Viewed