డొంకేశ్వర్‌లో ఇద్దరు వైద్య సిబ్బందికి కరోనా

by vinod kumar |
డొంకేశ్వర్‌లో ఇద్దరు వైద్య సిబ్బందికి కరోనా
X

దిశ, ఆర్మూర్: ఉమ్మడి నిజమాబాద్ జిల్లాలో కరోనా వైరస్ విస్తృతంగా వ్యాప్తిచెందుతోంది. రోజురోజుకూ భారీగా కేసులు పెరుగుతూ, విలయతాండవం చేస్తోంది. తాజాగా నిజామాబాద్ జిల్లా నందిపేట్ మండలంలోని డొంకేశ్వర్ ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఇద్దరు వైద్య సిబ్బంది కరోనా పాజిటివ్ వచ్చినట్టు డాక్టర్ గంగరెడ్డి తెలిపారు. వారు నిత్యం నిజామాబాద్ నుంచి డొంకేశ్వర్ ఆసుపత్రిలో విధులకు వచ్చేవారు. బుధవారం డొంకేశ్వర్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఆరుగురికి కరోనా పరీక్షలు నిర్వహించారు. అందులో ఇద్దరికి పాజిటివ్ రాగా, నలుగురికి నెగిటివ్ వచ్చింది. దీంతో వారి ప్రైమరీ కాంటాక్ట్ వివరాలను ఆరా తీస్తున్నారు.

Advertisement

Next Story