- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రాజస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం..10 మంది మృతి
by Sumithra |
X
దిశ,వెబ్ డెస్క్: రాజస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. చిత్తోర్ ఘర్‌లోని ఉదయ్ పూర్-నింబారా జాతీయ రహదారిపై బౌడీ బస్సు స్టాప్ సమీపంలో రెండు జీపులు ఒక దానితో మరొకటి ఢీ కొన్నాయి. ఈ ఘటనలో 10 మంది మృతి చెందారు. మరో 12 మందికి తీవ్రగాయాలు అయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.
క్షత గాత్రులను స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతులను మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. వీరంతా సన్వాలియా సేత్ ఆలయానికి వెళ్లడానికి రాజస్థాన్ వచ్చినట్టు పోలీసులు తెలిపారు. కాగా ఓవర్ టేక్ చేసే క్రమంలో ఒక జీప్‌ను మరో జీప్ ఢీ కొనడంతో ఘటన జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు.
Advertisement
Next Story