- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
పాక్‌లో ఇద్దరు భారత అధికారులు మిస్సింగ్!
by Shamantha N |

X
న్యూఢిల్లీ: పాకిస్తాన్‌లో విధులు నిర్వర్తిస్తున్న ఇద్దరు భారత హైకమిషన్ అధికారులు అదృశ్యమయ్యారు. ఇస్లామాబాద్‌లో ఉంటున్న వీరు సోమవారం ఉదయం 8 గంటల నుంచి కనిపించడం లేదని కొన్ని వర్గాలు తెలిపాయి. దీనిపై భారత ప్రభుత్వం పాకిస్తాన్‌కు ఫిర్యాదు చేసింది.
కాగా, మన దేశ రాజధానిలో పాకిస్తానీ హై కమిషన్‌గా విధులు నిర్వహిస్తున్న ఇద్దరు పాక్ అధికారులు గూఢచర్యానికి పాల్పడుతున్నారని కేంద్రం వారిని నక్కి పంపిన తర్వాత ఈ ఘటన వెలుగులోకి రావడం గమనార్హం.
గత కొన్ని రోజులుగా ఇస్లామాబాద్‌లో ఉంటున్న భారత ఉన్నతాధికారులపై విపరీతమైన నిఘా అమలవుతోంది. మితిమీరిన గూఢచర్యాన్ని భారత ప్రభుత్వం ఇప్పటికే నిరసించిన సంగతి తెలిసిందే.
Next Story