- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
విషాదం మిగిల్చిన బావి
దిశ, పాలేరు: దాహం తీర్చుకోవడానికి వాగు వద్దకు వెళ్లిన ఇద్దరు బాలికలు ప్రమాదవశాత్తు నీట మునిగి మృతిచెందారు. ఈ ఘటన ఖమ్మం రూరల్ మండలం పరిధిలోని మంగళగూడెం రెవెన్యూ శివారు గ్రామమైన డోర్నకల్ మండలం వెన్నారం గ్రామాల మధ్యలో కోతుల వాగులో సోమవారం చోటుచేసుకుంది. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలంలోని హరిశ్చంద్రుడు తండాకు చెందిన గుగులోతు త్రిష(14) , గుగులోతు సింధు(12) పశువులు మేపడానికి ఇరువురు మంగళగూడెం శివారుకు వెళ్లారు.
మధ్యాహ్నం వేళ దాహం వేయడంతో కోతుల వాగు సమీపంలోని బావిలోకి దిగి నీట మునిగిపోయారు. స్థానికులు ఆలస్యంగా గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి సమీపంలోని వెన్నారం, మంగళ గూడెం గ్రామ ప్రజలు వచ్చి మృతదేహాలను గాలించి వెలికి తీశారు. విషయం తెలిసిన తల్లిదండ్రులు రోదనలు మిన్నంటాయి. వారు రోదిస్తున్న తీరు పలువురిని కంటతడి పెట్టించింది.