అమెరికాలో గాల్లో ఢీకొన్న రెండు విమానాలు

by vinod kumar |
అమెరికాలో గాల్లో ఢీకొన్న రెండు విమానాలు
X

దిశ, వెబ్ డెస్క్: అమెరికాలోలో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. గాల్లోనే రెండు విమానాలు ఢీకొనడంతో ఏడుగురు మృతి చెందారు. కెనాయ్ ద్వీపకల్పంలోని నోల్డట్నా నగరం సమీపంలోని ఎయిర్ పోర్టు వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

ఒక విమానంలో అలస్కా ప్రాంత ప్రజాప్రతినిధి గ్యారీ న్యాప్ ఉండగా.. మరో విమానంలో నలుగురు పర్యాటకులు సహా ఒక ఫైలెట్, గైడ్ ఉన్నట్లు సమాచారం. ఈ ప్రమాదంలో రెండు విమానాల్లో ఉన్న ఏడుగురు మృతి చెందారు. విమానాల ఢీకొన్న ఘటనపై ఎఫ్ఏఏ, జాతీయ రవాణా భద్రతా బోర్డు దర్యాప్తు జరుగుతోంది.

Advertisement

Next Story