- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మేకలు మేపడానికి వెళ్లి.. అనంతలోకాలకు
దిశ, నిజామాబాద్ రూరల్: నిజామాబాద్ రూరల్ జిల్లా ధర్పల్లి మండలం రామడుగులో విషాద ఘటన చోటుచేసుకుంది. మేకలు మేపడానికి వెళ్లిన బాబాయ్, అబ్బాయ్‌లు తనువుచాలించారు. డిచ్‌పల్లి ఎస్ఐ ఆంజనేయులు వివరాల ప్రకారం.. రామడుగు ప్రాజెక్ట్ వద్దకు గ్రామానికి చెందిన మహమ్మద్ ఫర్హత్(14) సోమవారం మేకలు మేపడానికి వెళ్లాడు. మేకలు మేస్తుండగా, స్నానం చేయడం కోసం చెరువులోకి దిగాడు. అలాగే ఈతకొడుతూ లోతైన ప్రాంతానికి వెళ్లాడు. ఈతరాక భయాందోళనతో అరవడం ప్రారంభించారు. దీంతో గమనించిన స్థానికులు ఫర్హత్ బాబాయ్(అబ్దుల్ ఖాదర్)కు సమాచారం ఇచ్చారు. వెంటనే ప్రాజెక్ట్ వద్దకు వచ్చిన ఖాదర్ ఫర్హత్‌ను కాపాడబోయే క్రమంలో ఆయన కూడా నీటితో మునిగిపోయాడు. ఆందోళన చెందిన స్థానికులు పోలీసులకు సమాచారం అందజేశారు.
అప్పటికే ఇరువురు నీటితో మునిగిపోగా, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని గజ ఈతగాళ్లతో గాలించారు. చివరకు సాయంత్రం సమయంలో అబ్దుల్ ఖాదర్, అతని అన్న కుమారుడు ఫర్హత్ మృతదేహాలు లభ్యం అయ్యాయి. ఒకే కుటుంబంలో ఇద్దరు ప్రాజెక్ట్‌లో పడి మరణించడంతో రామడుగులో విషాద ఛాయలు అలుముకున్నాయి. బాధాకరమైన ఘటన అని బంధువులు, గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. మృతుడు ఖాదర్‌కు ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు, భార్య ఉన్నట్లు స్థానిక ఎస్ఐ ఆంజనేయులు తెలిపారు. అనంతరం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.