- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రాఖీ పండగకు వచ్చి విగత జీవులై..
దిశ, జగిత్యాల: సెప్టిక్ ట్యాంక్ నిర్మాణం కోసం తీసిన గుంత ఆ ఇంట విషాదాన్ని తెచ్చింది. రాఖీ పండుగకు సంతోషంగా వచ్చిన కుటుంబం.. చిన్నారుల మృతితో శోకసంద్రంలో మునిగింది. తవ్విన గొయ్యికి సేఫ్టీ మేజర్స్ తీసుకోకపోవడంతో ఇద్దరు చిన్నారులు అందులో పడి మృతి చెందిన ఘటన జగిత్యాల జిల్లాలో వెలుగుచూసింది.
జగిత్యాల జిల్లా మేడిపల్లిలో శుక్రవారం ఈ విషాదం చోటుచేసుకుంది. రాఖీ పండుగ సందర్భంగా తన తల్లితో అమ్మమ్మ ఇంటికి వచ్చిన రుతిక (7), అశ్వంత్(5) ఆడుకుంటూ వెళ్లి మరుగుదొడ్ల కోసం తీసిన సెప్టిక్ ట్యాంక్ గుంతలో పడ్డారు. ఇటీవల కురిసిన వర్షాలకు ఆ గుంత నీటితో నిండి ఉండడంతో చిన్నారులు ఇద్దరు ఊపిరి ఆడక ఆపస్మారకస్థితిలోకి వెళ్లారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న వీరిని జగిత్యాల ప్రైవేటు ఆసుపత్రికి తరలిస్తుండగా ప్రాణాలు కొల్పోయారు. దీంతో బాధిత తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.