భాష్యం స్కూల్ బస్సులకు అగ్నిప్రమాదం

by srinivas |
భాష్యం స్కూల్ బస్సులకు అగ్నిప్రమాదం
X

దిశ, వెబ్ డెస్క్: కడప జిల్లా పులివెందుల పట్టణం లోని భాష్యం స్కూల్ కి చెందిన రెండు బస్సులు అగ్నికి ఆహుతయ్యాయి. పట్టణంలోని బేతాళ చర్చి సమీపంలో మూడు బస్సులు పార్క్ చేయగా శనివారం మధ్యాహ్నం రెండు బస్సుల్లో మంటలు చెలరేగాయి. గమనించిన స్థానికులు ఫైర్ స్టేషన్ కు ఫోన్ చేయగా ఫైర్ సిబ్బంది హుటాహుటిన అక్కడికి చేరుకుని మంటలు అదుపు చేశారు. ఫైర్ స్టేషన్ అధికారులు అగ్నిప్రమాదానికి కారణం ఏమై ఉండొచ్చు అనే వివరాలు త్వరలోనే తెలుపుతామని చెప్పినట్టు భాష్యం స్కూల్ ప్రిన్సిపాల్ సాయి శ్రీకృష్ణ తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed